తెలుగు సినీ రంగంలో కమర్షియల్ సినిమాకు ఓ ఫార్ములా ఉంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి తెరకెక్కించే సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు ఓ పర్ఫెక్ట్ టెంప్లెట్‌ను ఫాలో అవుతుంటారు. హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో చూపించే భారీ ఎలివేషన్‌ సీన్స్‌. గ్లామరస్ హీరోయిన్స్‌, ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఇలా అన్ని పక్కాగా ప్లాన్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు కంప్లీట్‌ అవ్వాలంటే మరో క్రేజీ పాయింట్ కూడా ఉండాల్సిందే. అదే ఐటమ్‌ సాంగ్.

 

మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాలంటే సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఈ ఫార్ములా ఇప్పటిదేం కాదు. తెలుగు సినిమా తొలి నాళ్ల నుంచే సినిమాలో స్పెషల్ సాంగ్‌ అనే ఫార్ములా ఉంది. అయితే ఎన్టీఆర్‌ ఫుల్‌ ఫాంలో ఉన్న సమయంలో ఐటమ్‌ సాంగ్స్‌ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడిచింది. అప్పట్లో ఐటమ్‌ సాంగ్స్‌ కోసం అంటూ స్పెషల్ గా కొంత మంది ఆర్టిస్ట్‌లు ఉండే వారు. జయమాలిని, జ్యోతి లక్ష్మీ, అనురాధ లాంటి వారు ఒక తరాన్ని ఉర్రూతలూగించారు.

 

తరువాత అదే ఫార్ములను చిరంజీవి జనరేషన్‌లోనూ కంటిన్యూ చేశారు. ఈ జనరేషన్‌లో ఐటమ్‌ సాంగ్‌కు మరింత గ్లామర్‌ను యాడ్ చేశారు. సిల్క్‌ స్మిత, డిస్కో శాంతి లాంటి స్టార్స్‌ ఆట పాటలతో పాటు అందాల ఆరబోతలోనూ పోటి పడేవారు. అలా వెండితెరపై వేడి పుట్టించిన స్పెషల్‌ సాంగ్‌ బ్యూటీస్‌ చాలా మందే ఉన్నారు. ఈ జనరేషన్‌లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్‌ అంటే స్పెషల్ ఆర్టిస్ట్‌ లు ఏం లేరు. కమర్షియల్ సినిమా హీరోయిన్లే స్పెషల్‌ సాంగ్‌ లకు కూడా సై అంటున్నారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉన్న సమయంలో కూడా స్పెషల్‌ సాంగ్స్‌లో నటిస్తున్నారు ఈ జనరేషన్‌ టాప్‌ హీరోయిన్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: