సిని పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చి... ఐటెం గర్ల్ అయిపోయిన వారిలో హంస నందిని ఒకరు. గ్లామర్ ఉన్నా సరే ఆమెకు మాత్రం హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. చాలా సినిమాల్లో ఆమెను అన్నీ ప్రత్యేక పాత్రలే వరించాయి గాని సరైన పాత్ర మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఆమెకు. ఎప్పుడో 2004 లో ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాతి నుంచి ఏడాదికి ఒక సినిమా చేస్తూ వచ్చింది. ఇక తమిళం, కన్నడ, హింది భాషల్లో సినిమాలు చేసింది. అయినా సరే పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు ఆమెకు. 

 

కాని ఆమెకు సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్ వచ్చింది అనే చెప్పాలి. కీలక దర్శకులతో ఆమెకు పరిచయాలు ఉన్నా సరే అంతగా ఆకట్టుకోలేదు. కొందరు అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు వచ్చినా సరే హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. దీనితో ఆమె ఎప్పుడో ఒక సినిమాలో కనపడుతుంది గాని పెద్దగా నటించడం లేదని అంటున్నారు. అయితే ఆమెకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి సినిమాల మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదని మరికొందరు అంటున్నారు. 2013 లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో ఆమె ఒక పాట చేసింది. 

 

ఇక ఆమె నవ్వుకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. మిర్చి సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ కి మంచి గుర్తి౦పు వచ్చింది. నాగార్జున హీరోగా వచ్చిన భాయ్ సినిమాలో కూడా ఆమె ఐటెం సాంగ్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చింది. 2014 లో బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాలో కూడా ఆమెకు అవకాశం దక్కింది. గోపి చంద్ సినిమా లౌక్యంలో ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది. అయినా సరే ఆమెకు హీరోయిన్ గా మాత్రం సరైన పాత్ర రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: