బిల్లా సినిమాలో హీరో పాత్ర పక్కన కీలక రోల్ చేసిన నమిత... ఆ సినిమాతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది. సాధారణంగా హీరోయిన్స్ స్లిమ్ గా ఉండాలి. కాని నమిత విషయంలో మాత్రం అలా ఉండదు. ఆ సినిమాలో ఆమె చేసిన స్కిన్ షో యూత్ ని బాగా ఆకట్టుకుంది. ప్రభాస్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటించింది నమిత. బికినీ కూడా వేసుకుంది ఆ సినిమాలో. ఆ బికినీ కి మాత్రం మంచి మార్కులు పడలేదు. ఆ సినిమా తో మాస్ ప్రేక్షకుల్లో నమిత అనగానే ఒక క్రేజ్ వచ్చింది. వరుస అవకాశాలు వస్తాయని భావించినా ఆ సినిమా ఫ్లాప్ కావడం తో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. 

 

టాలీవుడ్ లో తనకు ఒక ఇమేజ్ ఉన్నా సరే ఆమె వాడుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. బాలకృష్ణ హీరోగా వచ్చిన సింహ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా సరే ఆమెకు అవకాశాలు రాలేదు. కాని హాట్ గర్ల్ గా కుర్ర కారుని ఒక ఊపు ఊపింది. దాదాపు అగ్ర హీరోలు అందరి సినిమాల్లో ఏదోక పాత్రలో కనపడింది నమిత. అటు తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయినా సరే ఆమె మాత్రం హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయింది. 

 

అయితే ఆమె ఒళ్ళు తగ్గించుకుని స్లిమ్ గా అవ్వాలని ఎందరు సూచించినా సరే ఆమె మాత్రం అందుకు ఇష్టపడలేదని అంటున్నారు. అందుకే అవకాశాలు దూర౦ అయ్యాయని టాక్. తమిళంలో ఆమెకు మంచి అవకాశాలే వచ్చినా సినిమాల్లో హిట్ శాతం తక్కువగా ఉన్న నేపధ్యంలో అవకాశాలు పెద్దగా రాలేదు తర్వాత తర్వాత. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది నమిత. ప్రేమించి వివాహం చేసుకుంది ఈ బొద్దు హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: