ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చే ప్ర‌తి చిత్రం బాహుబ‌లి చిత్రంతో పోల్చుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ఏ చిత్ర‌మొచ్చినా స‌రే ప్యాన్ ఇండియా మూవీ బాహుబ‌లి చిత్రంతో కంపేర్ చేసుకుంటున్నారు. అది ఏ భాష చిత్ర‌మ‌యినా స‌రే. రాజ‌మౌళి ఆ చిత్రాన్ని ఆ స్థాయిలో తీర్చిదిద్దారు. ఇక ఈ విష‌యం ఇలా ఉంటే. ఓ కొత్త‌క‌థాంశంతో.. వినూత‌న్న కాన్సెప్ట్‌తో వాల్మీకి ర‌చిస్తోన్న ఓ దృశ్య కావ్యం ఘాఠి.  రామ్‌ధన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై దిలీప్‌ రాథోడ్‌ డా.పూనమ్‌ శర్మ హీరో హీరోయిన్లుగా వాల్మీకి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగు, బంజార భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ట్రైలర్ తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌెడ్‌, నిర్మాత, నటుడు ఎ.గురురాజ్‌ చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

 

ఈ సందర్భంగా ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ప్ర‌ముఖులు ఈచిత్ర ట్రైల‌ర్‌ని చూసి అందులో ఉన్న కొన్ని యాక్ష‌న్స్ సీన్స్‌ని ఘాఠీతో పోలుస్తున్నారు. అయితే అది ఎంతో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా హై బ‌డ్జెట్‌తో నిర్మించిన చిత్రం. ఆ చిత్రంతో దీన్ని పోలుస్తుంటే చాలా మంది సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బాహుబ‌లితో ఘాఠీకి పోటీనా అంటూ కొంత‌మంది నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ చిత్ర ట్ర‌యిల‌ర్ బాగా క‌ట్ చేసిన‌ప్ప‌టికీ అస‌లు విష‌యం సినిమాలో మాత్రం లేక‌పోతే సినిమా తుస్సంద‌టున్న విష‌యం కూడా కొంత మంది అదే వేదిక మీద అన్నారు. 

 

ఎందుకంటే ఎన్నో సినిమాల‌ను నిర్మించి చూసి వ‌చ్చిన వాళ్ళం. ట్ర‌యిల‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాసినిమాలో విష‌యం లేక‌పోతే మాత్రం ఘోర‌మ‌యిన ప‌రాయ‌జ‌యపాలు అవ్వ‌వ‌ల‌సి వ‌స్తుంద‌ని కొంత‌మంది పెద్ద‌లు స్టేజ్ మీదే ఆ ద‌ర్శ‌కుడికి సున్నితంగా చెప్పారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో
దర్శక నిర్మాత వాల్మీకి మాట్లాడుతూ…``ఇది నా మూడో సినిమా. ఘాఠి సినిమా విషయానికొస్తే ‘‘రాజస్థాన్‌లో ‘ఘాఠి’ అనే ఒక ప్రాంతంలో జరిగే కథ ఇది. బంజారవారికి మార్వాడీస్‌కి మథ్య చిన్న గొడవ రావడంతో బంజార వారు ఘాఠి ప్రాంతాన్ని వదిలేయాల్సి వస్తుంది. వారి మధ్య జరిగిన గొడవ ఏంటి? తిరిగి ఘాఠికి చేరుకున్నారా? లేదా? అన్నది చిత్ర కథాంశం. లవ్‌, ఎమోషన్‌, యాక్షన్‌ అంశాలు ఉంటాయి” అన్నారు. అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. ”.ట్రైలర్ నేను అనుకున్నదానికన్నా చాలా బాగుంది. వాల్మీకి పెద్ద దర్శకుడు అయ్యే అవకాశాలున్నాయి. యూనిట్‌ అందరికీ నా శుభాకాంక్షలు ” అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: