టాలీవుడ్ లో అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన లావణ్య త్రిపాఠి మంచి అందం, అభినయం ఉన్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. ఈ అమ్మడికి అదృష్టం మాత్రం అస్సలు కలిసి రావడం లేదు.  కొంత మంది హీరోయిన్లు ఎంత కష్టపడ్డా.. ఫలితం మాత్రం దక్కదు.  మరికొంత మంది హీరోయిన్లు నిజంగా గోల్డెన్ హ్యాండ్ అనొచ్చు.. ఛలో మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మక మందన నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి.  ఇక లావణ్య త్రిపాఠి ఆ మద్య నాగార్జున నటించిన సోగ్గాడే చిన్న నియన సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నా.. తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు.

 

గత ఏడాది అర్జున్ సురువరం లో నటించిన ఈ బ్యూటీసినిమా యావరేజ్ టాక్ రావడంతో పెద్దగా కలిసి రాలేదు. బలమైన కథనాలు ఉన్న సినిమాల్లో నటించకపోవడం ఈ అమ్మడికి మైనస్ గా మారింది. నిశ్శబ్దంగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడే లావణ్యా త్రిపాఠికి ఇప్పుడు తెలుగు, తమిళ భాషలలో ఆసక్తికరమైన పాత్రలు వస్తున్నాయి. ఆమెకు స్క్రిప్ట్‌ నచ్చితే... ఆ సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. తెలుగులో 'అర్జున్ సురవరం' విజయం తర్వాత 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'లో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. అందులో సందీప్ కిషన్ సరసన ఆమె కనిపించనున్నారు.

 

స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఆమెది హాకీ క్రీడాకారిణి పాత్ర. సినిమా కోసం కొన్ని రోజులు హాకీలో శిక్షణ తీసుకున్నారు. ఈ మద్య క్రీడా నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌' లావణ్యకు ఏమైనా కలిసి వస్తుందో లేదో చూడాలి. అయితే తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. భలే భలే మగాడివోయ్', 'శ్రీరస్తు శుభమస్తు' విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ లో ఆమెకు హ్యాట్రిక్ సినిమాలు గా మారినా అదృష్టం మాత్రం మారడం లేదు.  అందుకే ఇకనుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించేందుకు సిద్దమవుతున్నా అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: