ప్రతి సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంటే సినిమా ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరించ వచ్చు. ఐటెం సాంగ్ లో ఒక స్టార్ హీరోయిన్ స్పెషల్ ఎంట్రీ ఉంటే అది సినిమాకీ కలిసొస్తుంది . దీంతో అటు దర్శక నిర్మాతలు కూడా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటే సినిమాకు కాస్త కలిసొచ్చే అవకాశం ఉంది అని ఫీల్ అవుతూ  ఉన్నారు. ఇక ఈ ఐటమ్ సాంగ్ కు  సినిమాకు కలిసొచ్చే విదంగా మంచి క్రేజ్ వున్న వాళ్ళని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్  చేపిస్తున్నారు. ఐటమ్ సాంగ్స్ లో  అందాల ఆరబోతతో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు కూడా అదరగొడుతున్నారు. ఇలా ప్రతి సినిమాలో ఐటెం సాంగ్స్ కి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఇదంతా ఒకప్పటి మాట. 

 

 

 కానీ ఇప్పుడు చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కనిపించడం లేదు... ఒకవేళ సినిమాలో స్పెషల్ సాంగ్స్ ఉన్న ఆ స్పెషల్ సాంగ్స్ లో  స్పెషల్ ఎంట్రీ మాత్రం ఉండడం లేదు. సినిమాలోని ఆ స్పెషల్ సాంగ్ లో హీరో హీరోయిన్ల డాన్సులు చేస్తూ అదరగొడుతున్నారు. కొత్తగా ఐటమ్ సాంగ్స్ పెట్టడం ఎందుకు హీరోయిన్ల తోనే ఆ సాంగ్ చేస్తే సరిపోదు కదా అని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఓవైపు బడ్జెట్ కలిసి రావడంతో పాటు సినిమాకి కూడా ఉన్న హీరోయిన్ తో చేస్తే కాస్త బెటర్ గానే ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు.దీంతో ఈ మధ్య కాలంలో ఐటమ్ సాంగ్స్ పూర్తిగా కనిపించకుండా పోతున్నాయి. 

 

 

 ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో హీరో హీరోయిన్లు ఐటం సాంగ్స్ కంటే ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను ఐటమ్ సాంగ్ కంటే ఎక్కువగా అలరించిన సాంగ్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు... గిర్ర గిర్ర గిర్ర అని తిరుగుతాందే బుర్ర... అంటూ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా,  మెహరీన్ కౌర్ వేసిన స్టెప్పులు అభిమానులు ఇప్పటికే మరిచిపోరు. ఓవైపు అందాల ఆరబోతకు అందాల ఆరబోత.... మరోవైపు డాన్స్ చెప్పులు... ఇలా ఐటమ్ సాంగ్ కు  ఎక్కడ తీసిపోని విధంగా ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సాంగులో వెంకటేష్ తమన్నా... వరుణ్ తేజ్  మెహరీన్ మధ్య కెమిస్ట్రీ ఐటెం సాంగ్ కు మించి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: