మిల్కీ బ్యూటి అనేక తెలుగు సినిమాలలో నటించింది. ఈమె అందంతో ఎంతగానో మెప్పించే నటి. ఈ ముంబాయి భామ 2005 నుండి కూడా చిత్రాలలో నటిస్తూనే ఉంది. వివిధ సినిమాలలో ఈమె పాత్ర చెప్పుకో దగినది. స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ ఈమె. మంచు మనోజ్ పక్కన శ్రీ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది ఈ బ్యూటి. ఆ తర్వాత తమన్నా హ్యాపిడేస్ సినిమాలో నటించింది. ఇలా అమె అనేక సినిమాలలో నటించింది ఎందరో హృదయాలని గెలుచుకుంది తమన్నా.

 

 

తెలుగులో మాత్రమే కాక అటు తమిళ్, హిందీ చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దు గుమ్మ. అయితే ఈమె చేసిన సినిమాలు మాత్రం నిజంగా చెప్పుకో దగ్గవి. ఈమె కేవలం సినిమాలలో మాత్రమే కాక స్టేజ్ ప్రోగ్రాంస్ అలానే ప్రొడక్ట్స్తో బ్రాండ్స్తో కూడా తమన్నా పని చేస్తూ ఉంటుంది. కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో గంగ పాత్రలో అదరకొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటించింది తమన్నా. ఆ సినిమాలో ఒక మాస్ అమ్మాయి క్యారక్టర్లో తమన్నా నటించింది. అటువంటి మాస్ క్యారక్టర్స్ లో కూడా తమన్నా కెవ్వు అనిపిస్తుంది. డాన్స్ కూడా చింపేస్తుంది తమన్నా. సినిమాల్లో వచ్చినప్పటి నుండి కూడా తమన్నా ఎన్నో రకాల రోల్స్ ప్లే చేసింది. ఏ రోల్ అయినా ఆమెకి సూట్ అయ్యిపోతుంది. 

 

 

తమన్నా ఐటం సాంగ్ కూడా చేసింది. ఆమె ఐటం సాంగ్లో ఎంతో హాట్గా కనిపించింది. ఐటం సాంగ్లో కూడా తిరుగులేదు తమన్నాకి. ఈ మిల్కీ బ్యూటి కుర్రకారుకి జోష్ తెప్పించింది. శృతి హాసన్, కాజల్ అగర్వాల్ వంటి వాళ్ళు కూడా ఐటం సాంగ్స్ చేసారు. తమన్నా కూడా చేసి అదరగొట్టింది. అయితే బెల్లంకొండ శ్రీను చేసిన అల్లుడు శీను సినిమాలో ఆమె లబ్బర్ బొమ్మ పాటకి కత్తిలాంటి డాన్స్ ఇచ్చింది. ఆమె డాన్స్కి ఫిదా అవ్వక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: