దర్శకుడు కొరటాల శివ తన కెరియర్ లో ఎప్పుడు పడనివిధంగా చిరంజీవి ‘ఆచార్య’ మూవీతో టెన్షన్ పడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కథ ఎప్పుడో ఫైనల్ అయినప్పటికీ ‘సైరా’ మూవీ ఆలస్యం వల్ల ‘ఆచార్య’ ప్రారంభం లేట్ అయింది. అయితే ఆ తరువాత చిరంజీవి ఈ మూవీని 100 రోజులలో పూర్తి చేయాలి అంటూ కొరటాల కు స్పష్టమైన టార్గెట్ ఇవ్వడంతో కొరటాలమూవీ నుండి ఈ సంవత్సరం ఆగష్టు కు బయటకు వచ్చేద్దాం అని భావించాడు.


అయితే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ పాత్ర విషయంలో రాజమౌళి సహకరించక పోవడం ఆతరువాత చర్చలలోకి వచ్చిన మహేష్ పాత్ర విషయమై చిరంజీవి రెండు రకాల ఆలోచనల ధోరణి కొరటాల ను తీవ్రంగా టెన్షన్ పెడుతున్నట్లు సమాచారం. మహేష్ ఈ మూవీలో ప్రత్యేక పాత్ర చేయడం ఇప్పుడు జరగదు అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి.


దీనితో తిరిగి యూటర్న్ తీసుకుని ఈ మూవీని రామ్ చరణ్ పాత్రతో పూర్తి చేసి ఈమూవీ నిర్మాణం కంప్లీట్ చేసి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత వచ్చే ఏడాది ఉగాది కి విడుదల చేద్దాము అంటూ చిరంజీవి కొరటాల కు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సినిమాలో కొరటాల దర్శకుడు మాత్రమే కాకుండా ఈ మూవీ బిజినెస్ లో షేర్ కూడ తీసుకునే విధంగా ముందుగానే చిరంజీవి చరణ్ లను ఒప్పించాడు.  


ఇటువంటి పరిస్థితులు వల్ల కొరటాల కు నష్టం కలగకుండా ఈ మూవీ అధికారికంగా ప్రకటించిన నాటి నుండి కొరటాల కు మెగా కాంపౌండ్ ప్రతినెల జీతం రూపంలో భారీ మొత్తాలు ఇస్తున్నట్లు టాక్. దీనితో కొరటాల కు వచ్చిన నష్టం ఏమిటి అంటూ మెగా కాంపౌండ్ ఆలోచన అని అంటున్నారు. అయితే ఈ మూవీ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా మరో సినిమా వైపు వెళ్ళలేని పరిస్థితులలో కొరటాల ఉన్నాడు అని అంటున్నారు. దీనితో తన బాధలను పూర్తిగా చిరంజీవితో చెప్పుకోలేక చెప్పుకున్నా అతడి అసహనానికి తానెక్కడ గురి అవుతాను అన్న బాధతో ప్రస్తుతం కొరటాల ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితులలో ఉన్నాడు అంటూ ఇంబ్దస్త్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: