జ్యోతి లక్ష్మి... భారతీయ సినిమా మరువలేని నటి. డాన్సర్ గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా ఆమె సత్తా చాటింది. దక్షిణాది భాషల్లో అన్నింటి లోను ఆమె నటించింది. దాదాపు వెయ్యికి పైగా పాటల్లో డాన్స్ చేసిన ఆమె... దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 1948 లో తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించిన జ్యోతి లక్ష్మి చిన్న నాటి నుంచి సినిమాల్లో ప్రేమను పెంచుకుని ఈమె చిన్నతనం నుండి ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి వద్ద పెరిగింది. ధనలక్ష్మి అప్పటికే ప్రసిద్ధ నటి. 

 

జ్యోతిలక్ష్మికి ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆమె అన్న వరస అయిన దర్శక నిర్మాత టి.ఆర్.రామన్న (పెద్దమ్మ కొడుకు) ఒక ఎం.జీ.ఆర్ సినిమాలో జ్యోతిలక్ష్మిచే నాట్యం చేయించాడు. ఎనిమిదేళ్ళ వయసులో శివాజీ గణేశన్ చిత్రం కార్తవరాయన్ కథలో డ్యాన్స్ చేసింది. తెలుగులో జ్యోతిలక్ష్మి తొలి చిత్రం 1967లో విడుదలైన పెద్దక్కయ్య. 1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు అన్న పాటతో ఆమె ఒక ఊపు ఊపింది అనే చెప్పుకోవచ్చు. ఆ పాట సూపర్ హిట్ అయింది ఆ సినిమాలో. 

 

ఇండస్ట్రీలో ఓ నయా ట్రెండ్ కు తెరలేపింది జ్యోతిలక్ష్మి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడు వందల సినిమాలకు పైగా నటించిన జ్యోతిలక్ష్మి.. వెయ్యికి పైగా పాటల్లో డ్యాన్స్ చేసింది. 80, 90 లలో తన డ్యాన్సులతో కుర్రకారు మతిపోగొట్టారు జ్యోతిలక్ష్మి. క్లబ్ డాన్సులకు ఆమె పెట్టింది పేరు. దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లో ఆమె నటించారు. ఆమె డాన్స్ లకు అప్పటి యువత ఊగిపోయింది. వరుస అవకాశాలతో దూసుకుపోయింది. హీరోయిన్ కి కూడా లేని క్రేజ్ ఆమె సొంతం చేసుకుంది. హీరోలతో సమానంగా ఆమెకు క్రేజ్ ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: