టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కి చెరగని ముద్ర వేసిన నటి జయమాలని. అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమాల మీద ఉన్న ప్రేమ తో ఆమె డాన్స్ నేర్చుకుని ఆ తర్వాత సినిమాల్లో అడుగు పెట్టి ఒక ఊపు ఊపింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె టాలీవుడ్ లో ఒక ఊపు ఊపారు. ఈమె అసలు పేరు అలమేలు మంగ. ఈమె అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. అందుకే అలమేలుమంగ అన్న పేరు పెట్టింది. అయితే ఆ పేరు చాలా మొరటుగా ఉందన్న ఉద్దేశంతో దర్శకుడు విఠలాచార్య ఈమెకు ‘జయమాలిని’ అని నామకరణం చేశారు. 

 

గుడివాడ వెళ్ళాను .. గుంటూరు వెళ్ళాను అనే పాట తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటికే ఈమె సోదరి జ్యోతిలక్ష్మి ఐటమ్‌సాంగ్స్‌లో నటిస్తోంది. ఆమెకు డ్యాన్స్‌ నేర్పేందుకు ఇంటికొచ్చిన గురువుల వద్దే జయమాలిని కూడా డ్యాన్స్‌ నేర్చుకుని సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఈవిడ చలాకీతనం, అందం, నృత్యం.. ఇవన్నీ గమనించే విఠలాచార్య ఈవిడకు అవకాశం ఇచ్చారు. తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడదాని అదృష్టం’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చేయాలని ఆయన వాళ్ళ అమ్మను అడగగా వాళ్ళ అంగీకరించడం తో ఆమె కెరీర్ మొదలయింది. 

 

1970 నుండి 1990 దశకం వరకూ అనేక విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించారు. అలాగే ఆమె హావభావాలకు ఎందరో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆమె డాన్స్ చూడటానికి ప్రేక్షకులు సినిమాకు వచ్చే వారు అప్పట్లో. ఆరు భాషల్లో ఆమె నటించారు. హీరోయిన్ గా కంటే ఆమె ఐటెం సాంగ్స్ ద్వారా నే మంచి గుర్తింపు పొందారు. యుక్త వయసులో ఉన్న ఈమె కూతురు నాట్యం చేర్చుకుంటున్నా, తను మాత్రం కూతుర్ని సినీరంగంలో అడుగు పెట్టనివ్వనని స్పష్టం చేసింది. ఇప్పుడు ఆమె అమెరికాలో ఉంటున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: