సిల్క్ స్మిత... ఈమె పేరు తెలియని వారు ఉండరు.. ఎందుకంటే ఆమె అందం అలాంటిది. అందంగా ఉండటం వేరు.. అందాన్ని ప్రేక్షకులకు చూపించి మైకం తెప్పించడం వేరు.. ఆకాలంలోనే అందచందాలతో ఆహా అనిపించినా నటి సిల్క్ స్మిత.. అలాంటి సిల్క్ స్మిత జీవితం అర్దాంతరంగా ముగిసింది... 

 

ఇంకా ఎన్నో సినిమాల్లో కనిపించి మైమరిపిస్తోంది అని అనుకున్న నటి అర్దాంతరంగా ఊహించని రీతిలో ఆత్మహత్య చేసుకొని మరణించారు.. ఆమె మరణం అప్పట్లో ఒక సంచలనం. ఆమె మరణంతో అప్పట్లో సినీ వర్గాలను కుదిపేసింది. అయితే ఇటీవలే నటుడు వీ రవిచంద్రన్ సిల్క్ స్మిత స్మిత సూసైడ్ కు సంబంధించి కొన్ని సీక్రెట్స్ చెప్పారు. అవి ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. 

 

అసలు ఈ వీ రవి చంద్రన్ ఎవరు? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. వీ రవి చంద్రన్ కన్నడ నటుడు.. నటుడిగా అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇతనికి సిల్క్ స్మితకు మంచి స్నేహం ఉండేది. 1992లో సిల్క్ స్మిత, వీ రవిచంద్రన్ కలిసి హల్లి మేస్త్రు అనే సినిమాలో నటించారు.. అప్పుడే వారి స్నేహ బంధం బలంగా అయ్యింది. 

 

అయితే ఆ నటుడితో చనిపోయే ముందు రోజు వరకూ సిల్క్ స్మిత చాలా స్నేహంగా ఉండేదని వీ రవిచంద్రన్ తెలిపాడు. ఆమె తనతో ఎంతో గౌరవంగా ఉండేదని, అలాగే తానూ ఆమె పట్ల అతను గౌరవంగా ఉండేవాడు అని తెలిపాడు. అంతేకాదు.. సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు కూడా అతనికి ఫోన్ చేసింది అని.. అయితే షూటింగ్ బిజీ వల్ల కాల్ మాట్లాడలేదు అని తెలిపాడు. 

 

ఆమె తనను కలవాలని ప్రయత్నించిందేమో కానీ అది సాధ్యం కాలేదని అయన చెప్పుకొచ్చాడు. అయితే ఆ ఫోన్ కాల్ కూడా సాధారణంగా చేసింది అనే అనుకున్నట్టు చెప్పాడు. ఆ సమయంలో ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ టెక్నికల్, పూర్ సిగ్నల్స్ కారణంగా మాట్లాడలేకపోయినట్టు.. ఆ మరుసటి రోజే ఆమె మరణించినట్టు రవిచంద్రన్ చెప్పాడు. 

 

తెలుగు, తమిళ, మళయాళ, కన్నడలలో 200పైగా సిల్క్ స్మిత చిత్రాలలో నటించింది. ఎన్నో సినిమాలలో ఆమె ప్రత్యేక పాటలలో, ఐటెం డ్యాన్స్ తో అమెకు ఎంతోమంది ఫ్యాన్స్ వచ్చారు. ఇంకా 'బావలు సయ్యా, మరదలు సయ్యా' అనే పాట ఇప్పటికి జనల నోర్లలో నానుతూనే ఉంటుంది. 

 

అయితే ఇంకా ఆమె సూసైడ్ ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయింది అనే చెప్పాలి.. అయితే ఆమె పెళ్లి చేసుకోలేదు.. అంతకముందు కూడా ఆమెకు లవ్ అఫైర్స్ ఉన్నట్టు.. ఇంకా సినీ నిర్మాణ ప్రయత్నంలో భారీ నష్టాలు రావడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి తప్ప.. ఆమె సూసైడ్ వెనుక అసలు రహస్యం బయటకు రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: