చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఫిలిం ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు అతడి లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో లీక్ అవుతున్న వార్తలు చాలమందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. 


మూవీ రషస్ చూసిన చాలామంది వైష్ణవ్ నటించిన ‘ఉప్పెన’ ఎక్కడ తొలి సినిమాల అనిపించదని అతడి నటన విషయంలో పరిపక్వత చాల స్పష్టంగా కనిపించింది అంటూ ఇప్పటికే ఈ మూవీని చూసిన వారు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని రెండు పాటలకు మంచి స్పందన రావడంతో ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. 


ముఖ్యంగా ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి వైష్ణవ్ తేజ్ లవ్ కెమిష్ట్రీ సీన్స్ ఈ మూవీకి కీలకంగా మారి యూత్ కు బాగా నచ్చుతాయి అని అంటున్నారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో అనుభవం పొందిన బుచ్చిబాబు సన కొత్త దర్శకుడు  అయినప్పటికీ ఈ మూవీ మేకింగ్ స్టైల్ లో సుకుమార్ టేకింగ్ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి అని అంటున్నారు. 


మూవీ కథ విషయంలో ఎడిటింగ్ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటూ చిరంజీవి వ్యవహరించిన తీరును బట్టి వైష్ణవ్ కెరియర్ గురించి చిరంజీవి ఎంత సీరియస్ గా తీసుకున్నాడో అర్థం అవుతుంది. గతంలో చిరంజీవి నటించిన ‘ఆరాధన’ మూవీ ఛాయలు ఈ మూవీలో చాల ఎక్కువగా కనిపిస్తాయి అన్న లీకులు వస్తున్నాయి. దీనితో మెగా క్రికెట్ టీమ్ లో వైష్ణవ్ తేజ్ ప్లేస్ ఖరారు కావడమే కాకుండా కొన్ని సంవత్సరాల పాటు ఈ టీమ్ లో తేజ్ తన హవా చూపించుకునే ఆస్కారం ఉంది అంటూ ఈ మూవీ పై వస్తున్న ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: