తెలుగు సినిమా ఐటమ్ సాంగ్ అనేది ఓ కమర్షియల్ ఎలిమెంట్‌. అందుకే మాస్ కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే స్టార్ డైరెక్టర్లందరూ ఐటమ్‌ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ లుగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు స్టార్ డైరెక్టర్లందరూ తమ సినిమాలకు మరింత గ్లామర్‌ యాడ్ చేసేందుకు ఐటమ్‌ సాంగ్‌నే నమ్ముకుంటున్నారు. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన దర్శకుడు రాజమౌళి. దేశం గర్వించదగ్గ సినిమాలు తెరకెక్కించే ఈ దర్శక ధీరుడు తన ప్రతీ సినిమాలోనూ ఓ కలర్‌ ఐటమ్‌ నంబర్‌ ఉండేలా జాగ్రత్త పడతున్నాడు.

 

రాజమౌళి పక్కా కమర్షియల్‌ ఫార్ములా సినిమాలు తెరకెక్కించటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ ఫార్ములా ఫాలో అవుతూనే ఉన్నాడు. సింహాద్రి, సై సినిమాల్లో హీరోయిన్లతోనే ఐటమ్ సాంగ్స్‌ను తలపించే డ్యాన్స్‌ నెంబర్స్‌ చేయించాడు. తరువాత ఛత్రపతి నుంచి స్పెషల్ సాంగ్స్‌ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడు జక్కన్న. ఛత్రపతి, విక్రమార్కుడు సినిమాల్లో అదిరపోయే ఐటమ్ నంబర్స్‌తో అలరించాడు. 

 

యమదొంగ సినిమా కోసం అయితే ఏకంగా రంభ లాంటి స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ చేయించాడు. మగథీర లాంటి ఫాంటసీ సినిమా తో పాటు బాహుబలి లాంటి ఫోక్‌లోర్‌ మూవీలో కూడా తన ఐటమ్‌ సాంగ్ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేశాడు రాజమౌళి. ఇక మాస్‌ హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలో ఓ రేంజ్‌ పేరున్న బోయపాటి కూడా తన ప్రతీ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ ఉండేలా చూసుకున్నాడు. భద్ర నుంచి వినయ విధేయ రామ వరకు ప్రతీ సినిమాలో ఓ స్పెషల్ బ్యూటీతో స్పెషల్ సాంగ్ చేయించాడు.

 

ఇక ఐటమ్ సాంగ్స్‌ తెరకెక్కించటంలో సుకుమార్ స్టైలే వేరు. తొలి సినిమా ఆర్య నుంచే ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న సుకుమార్ తన ప్రతీ సినిమాలోనూ ఓ అదిరిపోయే ఐటమ్ నంబర్‌తో అలరిస్తున్నాడు. సుకుమార్ సినిమా అంటే సంగీత దర్శకుడు దేవీ  శ్రీ ప్రసాద్‌ కూడా స్సెషల్ కేర్ తీసుకొని మరి సాంగ్స్‌ కంపోజ్‌చేస్తాడు. అందుకే వీరి కాంబినేషన్‌లో చార్ట్‌ బస్టర్స్‌గా నిలిచిన ఐటమ్‌ సాంగ్స్‌ చాలానే వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: