తెలుగు సినిమాలలో ముఖ్యంగా హిట్ అయ్యేవి మాత్రం ఐటెం సాంగ్స్.. సినిమాలో ఎంత కథను మలుపు తిప్పిన  కూడా యువతను ఆకట్టుకునేలా ఒక్క పాట లేదా సీన్లు లేకుంటే ఆ సినిమాలు హిట్ అనే మాటను పూర్తిగా మర్చిపోవాల్సిందేనా...అందుకే సినిమా వాళ్ళు ముఖ్యంగా హిరోయిన్ ను మించిన విధంగా ఇటెమ్ పాపలను సినిమాలలో తీసుకొస్తారు.. అయితే ఇప్పుడు ఒక సినిమాలో ఉన్న ఐటెం హీరోయిన్లు మరో సినిమాలో కనిపించలేదని చెప్పాలి.. 

 

 

 

అయితే అసలు విషయానికొస్తే ఐటెం పాపలకు సినిమాలు కూడా ఈ మధ్య ఎక్కువగా రావడం లేదు.. అయితే ఒకప్పుడు మహేష్, ప్రభాస్,వెంకటేశ్ సినిమాలలో ఐటెం సాంగ్స్ తో అదర  గొట్టిన ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు ఇప్పుడు సినిమాలలో కనిపించలేదు.. వాళ్ళు కనిపించక పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని సినీ విమర్శకులు అంటున్నారు.. అసలు ఎందుకు ముమైత్ ఇప్పుడు సినిమాలలో కనిపించలేదు.. ఏదైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం...

 

 

 

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపేసిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సినిమాలలో కనిపించలేదు.. అయితే బిగ్ బాస్ లో పాల్గొన్న ఈ అమ్మడు సినిమాలకు పూర్తిగా దూరమైంది.. అలా దూరమా అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అని సినీ విమర్శకులు చెబుతున్నారు.. అసలేంజరిగిందంటే ఆమె సినిమాలో నటిస్తున్నా సమయంలో దర్శక నిర్మాతలపై నోరు పారేసుకున్న కారణంగా సినిమాలకు దూరమైంది అందరూ అంటున్నారు...

 

 

 

ప్రస్తుతం ముమైత్ ఖాన్ సొంతంగా చిరు వ్యాపారాలను చేసుకుంటూ పోతుందని కొందరు వెల్లడిస్తున్నారు...ఈ మధ్య పాయాల్ రాజ్ పూత్ ప్రధాన  పాత్రలో నటించిన సినిమా లో ముమైత్ అలా మెరిసి వెళ్లిపోయింది.. ముమైత్ లాంటి డ్యాన్సర్స్ సినిమాలలో ఉండాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు... సినిమా రంగానికి కొత్తదనాన్ని తీసుకొస్తాము అంటూ ఉన్న బంగారాన్ని వదిలేసి కాకీ బంగారం కోసం ఎదురు చూస్తున్నారని అందరూ అంటున్నారు... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: