సాధార‌ణంగా సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం నడుస్తున్న ట్రెండ్ లో స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్స్ కి గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్నారు. ఎందుకంటే.. దాదాపు కొన్ని సినిమాలను వాటికోసమే చూసేవారు చాలా మంది ఉన్నారు కాబ‌ట్టి. అలాగే హీరోయిన్స్‌గా ఛాన్స్‌ రానివారు చాలా మంది ఐటెం సాంగ్స్‌తో కెరీర్‌ను నెట్టుకు వచ్చిన వారు ఉన్నారు.  మ‌రియు ఐటెం సాంగ్స్‌ చేసి మళ్లీ హీరోయిన్‌గా పుంజుకున్న వారు కూడా లేకపోలేదు. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. బ‌న్నీ స‌ర‌స‌న అంజ‌లి `బ్లాక్ బస్టర్..బ్లాక్ బస్టరే` అంటూ సరైనోడు సినిమాలో చిందులేసిన‌ సంగ‌తి తెలిసిందే.

 

బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్‌, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా 2016 సమ్మర్ స్పెషల్ ఊరమాస్ మూవీగా వచ్చిన సరైనోడు సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోయిజం, ఆది పినిశెట్టి స్టైలిష్ విలనిజం సినిమాకు ప్రధాన బలాలు. ఈ చిత్రం `బ్లాక్ బస్టర్..బ్లాక్ బస్టరే` ఐటెం సాంగ్‌లో తెలుగమ్మాయి అంజలి.. బ‌న్నీ స‌ర‌స‌న కుమ్మేసింద‌నే చెప్పాలి. ఇక్క‌డ మ‌రో విష‌యం అంటే.. అప్ప‌ట్లో సినిమా నుంచి మొదటి పాటనే ఐటెం సాంగ్‌నే రిలీజ్ చేశారు. దీంతో ఈ సాంగ్ నోట్టింట్లో తెగ వైర‌ల్ అయింది. ఎక్క‌డ చూసినా ఆ పాటే వినిపించేది.

 

అలాగే ఈ సాంగ్‌లో బన్నీ కూడా ఓ రేంజ్ లో డాన్సు ఇర‌గ‌తీశాడు. కాగా,  అంజలి కోలీవుడ్ లో ప్రూవ్ చేసుకుని టాలీవుడ్ లో సగర్వంగా అడుగుపెట్టింది. ఆరంభం అదుర్స్ అనిపించేలా ఉన్నా.. కీలకమైన స్టేజ్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ కారణంగా వెనకబడింది. ఆ టైమ్‌లో నందమూరి బాలకృష్ణ సరసన డిక్టేటర్ లో కీలక పాత్ర చేసినా ఈ భామకు పెద్దగా అచ్చి రాలేదు. సినిమా యావరేజ్ అయినా అంజలికి మాత్రం దక్కిందేమీ లేదు. దీంతో ఇప్పుడీ భామ తన ఆశలన్నీ అల్లు అర్జున్ స‌రైనోడు సినిమాపైనే పెట్టుకుంది. ఇక ఈమె ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్టు స‌రైనోడు చిత్రంలో అంజ‌లి సాంగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా న‌టిచింది.

 

 
  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: