తెలుగు సినిమాల్లో పాటలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో ఉండే ఐదారు పాటల్లో ఒక ఐటెం సాంగ్ ఉండటం ఆనవాయితీగా వస్తుంది. ఐటెం సాంగ్ అంటే జనాలకి ఉండే ఇంట్రెస్టే వేరు. సినిమా కథకి సంబంధం లేని వాళ్ళు కేవలం ప్రేక్షకులకి ఆనందం పంచడానికే హీరోలతో స్టెప్పులేస్తారు. ఈ ఐటెం సాంగ్స్ అనేవి ఇప్పటి సాంప్రదాయం కాదు. నాగేశ్వరరావు ఎన్టీఆర్ ల కాలం నుండే మన సినిమాల్లో ఇది కనిపిస్తుంది.

 

 

ఐటెం గర్ల్ గా చేసిన వాళ్ళకి సినిమాల్లో నటించే స్కోప్ ఏమీ ఉండదు. వాళ్లని నటీమణులుగా అస్సలు చూడరు. ఏదో పాటకి వచ్చి డాన్స్ చేసే వాళ్ళలాగే పరిగణిస్తారు. అయితే తెలుగులో ఎంతో మంది ఐటెం గర్ల్స్ ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలకి స్టెప్పులు వేశారు. అయితే ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్స్ చాలా వరకు తగ్గుతున్నాయి. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. మన సినిమాల్లో మార్పు రావడం కూడా ఒక కారణమే.

 

అయితే ఐటెం సాంగ్స్ తగ్గుతుండటం ఎంత నిజమో స్పెషల్ సాంగ్స్ పెరగడం కూడా అంతే నిజం. అవును గత కొన్ని రోజులుగా మన స్టార్ హీరో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పెరుగుతున్నాయి. అసలు ఐటెం సాంగ్ కి స్పెషల్ సాంగ్ కి తేడా ఏంటి అనేది ఆలోచిస్తే ఒకే ఒక్క నిజం బయటపడుతుంది. సినిమాకి సంబంధం లేని హీరొయిన్ స్టేటస్ లేని ఒక గర్ల్ ప్రత్యేక పాటలో హీరోతో కలిసి డాన్స్ చేస్తే అది ఐటెం సాంగ్. అదే హీరోయిన్ స్టేటస్ ఉండి, చాలా సినిమాల్లో హీరోయిన్ గా మెరుపులు మెరిపించి, ఇప్పుడు అవకాశాలు లేకనో, లేదా మరే కారణం వల్లనో ప్రేక్షకులకి కనిపించి చాలా రోజులు అయితే, ఇలాంటి ప్రత్యేక పాటలో మెరవడమే స్పెషల్ సాంగ్ ముఖ్య ఉద్దేశ్యం..

 

కానీ రెండు పాటలు ఒకే లక్ష్యంతో కూడుకున్నవి. కాబట్టి వాటికీ, వీటికీ పెద్దగా తేడా లేదనే చెప్పాలి. కానీ హీరోయిన్స్ చేసేదేదైనా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి వాటికి స్పెషల్ సాంగ్స్ అని పేరు పెట్టారంతే..

మరింత సమాచారం తెలుసుకోండి: