ప్రియమణి అసలు పేరు ప్రియ వాసుదేవ్ మణి. కానీ సినిమాల్లో ప్రియమణిగా ఫేమస్ అయ్యిపోయింది. ఈ నటి ఎన్నో సినిమాల్లో నటించింది. మంచి నటనతో మంచి పాత్రలతో ఆకట్టుకునే నటి ప్రియమణి. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాక కన్నడ, తమిళ్, మళయాలం భాషల్లో కూడా నటించింది. హింది చిత్రం రావణ్ తో తన నటనా జీవితాన్ని ప్రారంభం చేసింది.

 

IHG

 

ప్రియమణి 2003 వ సంవత్సరంలో ఎవరే అతగాడు? చిత్రంతో తెలుగులో పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆమె సీనియర్ హీరో జగపతి బాబుతో పెళ్ళైన కొత్తలో సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రియమణికి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. కాలం కలిసి రావడంతో మంచి సినిమాలు వెతుక్కుంటూ వచ్చాయి ఆమెని. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో నటించింది. నితిన్ సరసన ద్రోణ సినిమాలో మాత్రం గ్లామర్ డాల్ గా ప్రియమణి కనపడింది. వన్ పీస్ తో స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రియమణి ఎంతో హాట్ గా కనిపించి మనసు దోచుకునేలా చేసింది. ఈ స్టన్నింగ్ బ్యూటి అవతారం చూసి ప్రేక్షకులు ఆమెకి ముగ్ధులైపోయారు. 

IHG

 

ఆ తర్వాత ప్రియమణి  మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర ఇలా అనేక సినిమాల్లో నటించింది. నటి ప్రియమణి చేసిన ఐటం సాంగ్ చెప్పుకోదగ్గది. షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో నటి ప్రియమణి వన్ టూ త్రీ ఫోర్.... సాంగ్ కి డాన్స్ చేసింది ఈ ఐటం సాంగ్ లో హాట్ డాన్స్ తో మతి పోగొట్టేసింది ఈ సుందరి. ఐటం సాంగ్ లో ప్రియమణిని చూస్తే ఫిదా అవ్వక తప్పదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: