భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అందరి అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపిస్తున్నాడు. సుమారు పదిభాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

 

అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయి సంవత్సరం పైగా కావొస్తున్న ఇప్పటి వరకూ టైటిల్ ని రివీల్ చేయలేదు. ఆర్.ఆర్.ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తోనే కాలం గడిపేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో టైటిల్ ని ప్రకటించనున్నారట. ఇప్పటి వరకు ఎన్నో పేర్లని పరిశీలించిన చిత్ర బృందం రెండు పేర్లని హోల్డ్ లో పెట్టిందని సమాచారం. అందులో ఒకటి రఘుపతి రాఘవ రాజారాం కాగా, మరొకటి రామ రావణ రాజ్యం గా ఉందని తెలుస్తుంది.

 

మరి ఈ రెండు పేర్లలో ఏ పేరుని డిసైడ్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్.ఆర్.ఆర్ ఆర్ నుండి వచ్చే అప్డేట్ అదే అని అంటున్నారు. ప్రతీ పండక్కి శుభాకాంక్షలు తప్ప మరో అప్డేట్ ఇవ్వని ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఈసారైనా ఏదో ఒక అప్డేట్ ఇచ్చి ప్రేక్షకులకి ఆనందాన్ని కలిగించాలని చాలామంది భావిస్తున్నారు. అప్డేట్ ఇస్తారా లేదా అనే విషయం కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.

 


ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ కనిపించనుంది. ఇంకా విలన్లుగా హాలీవుడ్ తారలు మెరుస్తున్నారు. ఒక ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కనబడుతున్నారు. ఈ సినిమా వచ్చే  సంక్రాంతికి జనవరి ౮వ తేదీన విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: