తెలుగులో చాలా సినిమాలో విల‌న్‌గా న‌టించాడు రాహుల్‌దేవ్‌. ఇత‌ను తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. నాగార్జున హీరోగా న‌టిచిన `మాస్` చిత్రంలో ఇత‌ని యాక్ష‌న్ మంచి పేరు కూడా వ‌చ్చింది. అలాగే రాంచ‌ర‌ణ్ `నాయ‌క్‌` చిత్రంలో ఇలా చాలా చిత్రాల్లో ఈయ‌న విల‌న్ పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్పుడు ఈయ‌న ప్రేమ‌లో ప‌డ్డార‌ని లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. కొంచం సందు దొరికితే చాలు మ‌న‌వాళ్ళు హెడ్డింగుల మీద హెడ్డింగులు పెట్టి అవ‌త‌లి వాళ్ళు స్పందించే వ‌ర‌కు వ‌ద‌ల‌రు క‌దా.

 

దీంతో ఈ వ్యాఖ్య‌ల పై స్పందించిన రాహుల్ అవును నాకు 51 సంవ‌త్స‌రాలు... ఆమెకు 33 ఏళ్ళు అయినా మేమిద్దరం ఒక‌రిని ఒక‌రం ఇష్ట‌ప‌డుతున్నాం త‌ప్పేముంది అని అన్నారు. మా అమ్మ‌, నాన్న‌కంటే ప‌దేళ్ళ చిన్న‌ది అయినంత మాత్రాన వాళ్ళిద్ద‌రూ సంతోషంగా ఉండ‌డం లేదా. మ‌రి ఇదేముంది అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాక మ‌న బంధం గట్టిగా ఆనందంగా ఉంటే వ‌య‌సుతో సంబంధం ఏముంద‌ని త‌న అభిప్రాయాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. 

 

ఇక రాహుల్ త‌న చిన్న నాటి స్నేహితురాలైన రైనాను వివాహం చేసుకున్నారు. 1998లో జ‌రిగిన వారి వివాహ బంధానికి ఒక కొడుకు కూడా పుట్టారు పేరు సిద్ధార్ధ్‌. అయితే అనుకోకుండా రైనా 2009లో క్యాన్స‌ర్ వ్యాధితో చ‌నిపోవ‌డం జ‌రిగింది. దీంతో రాహుల్ మ‌ళ్ళీ వివాహం చేసుకోలేదు. త‌న కుమారుడి పైనే దృష్టి పెట్టి త‌న‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా కేరింగ్‌గా చూసుకుంటార‌ట‌. అనుకోకుండా ఓ రోజు ఓ స్నేహితుడి పెళ్ళికి వెళితే అక్క‌డ అన్ ఎక్స్‌పెక్టెడ్‌గా ముగ్ధ ప‌రిచ‌యం అయింది. అప్ప‌టి నుంచి వీరి బంధం కొన‌సాగుతుంది అని తెలిపారు. ఇక సినిమా వాళ్ళ రిలేష‌న్స్లో ఇలాంటివి కాస్త ఎక్కువే. కానీ రాహుల్ ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇంకా బావుండేద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఇక వీళ్ళు ఎక్కువ‌శాతం డేటింగ్‌ల‌తోనే జీవితాల‌ని గ‌డిపేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: