మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు ఈ మద్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు.  ప్రతి చిన్న విషయంపై ఆయన తనదైన స్టైల్లో ట్విట్టర్ లో స్పందిస్తున్నారు.  మొన్నటి వరకు వెండితెరపై కనిపించిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కృషి చేస్తున్నారు.  మెగా బ్రదర్ సోదరుడు పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ స్థాపించిన తర్వాత గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు నాగబాబు.  కానీ ఆ పోటీలో దారుణమైన రిజల్ట్ పొందారు. అంతే కాదు పార్టీ స్థాపించిన పవన్ కళ్యాన్ సైతం రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

 

అయితే పార్టీ పెట్టిన ఐదు సంవత్సరాల తర్వాత మొదటి సారి పోటీ చేయడం.. అనుభవ రాహిత్యం.. కార్యకర్తల వైఫల్యం వెరసి జనసేన పార్టీ తరుపున ఒకే ఒక్కడు గెలుపు సొంతం చేసుకున్నారు.  ఈ మద్య నాగబాబు ప్రతి విషయాన్ని ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదా ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చుతున్న విషయం తెలిసిందే. ఈ మద్య కరోనాపై కూడా ఎన్నో ట్విట్టర్ పోస్టులు పెట్టారు.  తాజాగా మరోసారి ఆయన చేసిన ట్విట్ సోసల్ మీడియాలో వైరల్ గా మారింది.  ‘లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్లని అధికార, ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు.. ఏమిటో ఈ జనం. దేవుడా ఈ జనాల మనసు మార్చు (ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్)' అంటూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు. 

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీని గెలిపించి.. అధికార పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఓటర్లను ఉద్దేశించి న వ్యాఖ్యలే అయి  ఉంటాయని భావిస్తున్నారు.   అయితే నాగ బాబు పెట్టిన పోస్ట్ కి  కామెంట్లు చేస్తున్నారు. 'నువ్వు కేక అన్నా', 'కొన్ని జీవితాలు అంతే మారవు' , 'ఈ అలవాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రమే ఉంది.. ప్లీజ్ మారండి' అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: