మెగాస్టా చిరంజీవి సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా చేస్తున్నాడని తెలియగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో మెగాస్టార్ నక్సలైట్ గా కనిపిస్తున్నాడని ప్రచారాలు హోరెత్తాయి. షూటింగ్ సెట్స్ నుండి వెలువడిన మెగాస్టార్ లుక్స్ కూడా ఈ అంచనాలని మరింత పెంచాయి.

 

 

అయితే ఇదిలా ఉంటే సినిమా టైటిల్ గురించి కూడా బాగా రచ్చ జరిగింది. చిత్ర బృందం టైటిల్ ప్రకటించకముందే మెగాస్టార్, కొరటాల కాంబినేషన్లో వచ్చే సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మిడియాలో వార్తలు మారుమ్రోగాయి. గోవింద ఆచార్య అంటూ కొనసాగిన ప్రచారం నిజం అయ్యింది కూడా. ప్రస్తుతానికి ఆచార్య అనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇదే కన్ఫర్మ్ అని కూడా తేలిపోయింది.

 

 

 

టైటిల్ మాదిరిగానే మరో విషయం ఆచార్య విషయంలో నిజం కాబోతున్నట్తు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. రకరకాల పేర్లు వినిపించినా త్రిష పేరు పరిశీలనలో ఉందని సమాచారం అందింది. అయితే ఈ విషయంలో మరికొద్ది రోజుల్లో కన్ఫర్మేషన్ రానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ సరసన త్రిష కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

 

మరో రెండు వారాలో త్రిషసినిమా షూటింగ్ లో పాల్గొంటుందని అంటున్నారు. అదే నిజమైతే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత త్రిష మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించినట్టు అవుతుంది. మరి  ఆచార్య విషయంలో కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కనీసం హీరోయిన్ గురించైనా కన్ఫర్మేషన్ ఇస్తారేమో చూడాలి. ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: