టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్ల‌యినా కూడా సినిమాల్లో త‌న జోరు మాత్రం త‌గ్గించ‌లేదు. పెళ్ల‌య్యాక కూడా ఆమెకు రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాతో పాటు ఓ బేబీ, మ‌జిలీ సినిమాల్లో న‌టించి సూప‌ర్ హిట్లు కొట్టింది. ఇక స‌మంత తాజాగా త‌న మేనేజ‌ర్ ఆర్య‌న్ ప్రారంభించిన రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వ‌చ్చింది. ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించిన స‌మంత ప‌లు ఆసక్తిక‌ర ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు ఇచ్చింది. త‌న కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆర్య‌న్ త‌న‌తోనే ఉన్నాడ‌ని.. త‌న‌ను త‌ల్లిదండ్రుల కంటే ఎక్కువుగా ఆర్య‌న్ చూసుకున్నాడంటూ ప్ర‌శంస‌లు కురిపించింది.



ఆర్య‌న్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినందుకు ఆనందంగా ఉంద‌ని చెప్పింది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు మీడియా వాళ్లు స‌మంత‌ను మీకు ఆల్ టైం ఫేవరెట్ ఫుడ్ ఏది అంటూ ప్రశ్నించగా ఆమె వెంట‌నే ఆన్స‌ర్ ఇవ్వ‌లేదు. వెంట‌నే ఆర్య‌న్ వైపు చూస్తూ నా ఫేవరెట్ ఫుడ్ ఏది అంటూ నవ్వుతూ ప్రశ్నించగా అతడు సాల్మన్ ఫిష్ ఫుడ్ అన్నాడు. దీంతో అక్క‌డ అంద‌రూ షాక్ అయ్యారు. స‌మంత సాల్మ‌న్ ఫిష్ ఫుడ్ అంత ఇష్టంగా తింటుందా ?  అందులో ఆమెకు అంత ఏం న‌చ్చిందో అని చ‌ర్చించుకున్నారు.



ఇక స‌మంత‌కు ఇష్ట‌మైన సాల్మన్ ఫిష్‌కు అత్యంత మేలిమి ర‌క‌మైన చేప‌గా పేరు ఉంది. ఇక ఈ ఫిష్ స‌మంత‌కు చాలా ఇష్ట‌మైనా ఇటీవ‌ల కాలంలో పూర్తిగా వెజిటేరియ‌న్ తిన‌డంతో తాను ఈ కూర తిన‌డం లేద‌ని కూడా చెప్పుకొచ్చింది. ఇక స‌మంత పెళ్లి అయ్యాక తీసుకునే ఆహారం విష‌యంలో చాలా మార్పులు వ‌చ్చాయ‌ట‌. పూర్తిగా డైటింగ్ చేయ‌డంతో ఆమె ఫిట్‌నెస్‌తో పాటు బాడీ షేఫ్‌లో సైతం ఎక్క‌డా మార్పులు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఏదేమైనా సమంత తన ఫేవరెట్ ఫుడ్ ను కూడా మేనేజర్ ను అడిగి చెప్పిన వీడియోలు చూసి వామ్మో స‌మంత‌కు చాలా ఉందే అంటున్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: