భారీ చిత్రాల నిర్మాతగా అశ్వనీదత్ పేరు ఎనభై, తొంభై, రెండు వేల దశకాల్లో మోగిపోయింది. తర్వాత వరుస ఫ్లాపులు, నిర్మాణంలో మార్పుల వల్ల కొంత తగ్గిపోయారు. అడపాదడపా చేసినా పెద్దగా కలిసి రాకపోవడంతో మిన్నుకుండిపోయారు. 2018లో వచ్చిన మహానటితో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. అప్పట్లో బలవంతంగానే అశ్వనీదత్ ఆ సినిమా నిర్మించారని టాక్ వచ్చింది. కానీ.. నాగ్ అశ్విన్ చేసిన మాయాజాలానికి ఆ సినిమా బంపర్ హిట్ కావడంతో ఇప్పుడు పెద్ద సినిమాల నిర్మాణానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ హీరోగా ఓ భారీ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు.

 

 

ఇప్పుడు ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ కథాంశమంని, న్యూక్లియర్ వార్ నేపథ్యమనీ అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై అసహనానికి గురైన నాగ్ అశ్విన్ కూడా కథాంశం రివీల్ చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే.. మెజారిటీ మాత్రం సైన్స్ ఫిక్షన్ అని అంటున్నారు. తొంభైల్లో బాలకృష్ణ – సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చి ఆదిత్య 369 వంటి కధాంశమని అంటున్నారు. అప్పటికీ ఇప్పటి చిత్రీకరణలో ఎన్నో మార్పులు వచ్చాయి. కాలానుగుణంగా కధాంశం చెప్పాల్సి వస్తే మరిన్ని జాగ్రత్తలతో సైంటిఫిక్ గా తీయాల్సిందే. కాలానుగుణంగా వెనక్కు వెళ్తారా.. భవిష్యత్ ఆధారంగా సినిమా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

 

 

ఈ సినిమాకు అశ్వనీదత్ 300కోట్లు బడ్జెట్ కేటాయించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. భారీ సైంటిఫిక్ కథాంశం కాబట్టి ఇంత ఖర్చు పెడుతున్నారనే వాదనా ఉంది. ప్రస్తుతానికి ఈ వార్తలన్నీ రూమర్లే అయినా ఫిలింనగర్ లో మాత్రం రౌండ్ అవుతున్నాయి. వచ్చే నవంబర్ లో ఈ సినిమా ప్రారంభించేందుకు అశ్వనీదత్, నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట. గ్రీన్ మ్యాట్ షెడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. మరి.. పూర్తి డిటైల్స్ నాగ్ అశ్విన్ రివీల్ చేయాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: