కేజిఎఫ్ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న కన్నడ హీరో యష్ ప్రస్తుతం కేజిఎఫ్ 2 పార్టు లో నటిస్తున్నాడు. కే జి ఎఫ్ పార్టు 1 తో కన్నడ పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా ఆ సినీ బృందం చేసినా... అందులో హీరోగా నటించిన యష్ కి మాత్రమే టోటల్ క్రెడిట్ దక్కింది. ఐతే యష్ కి ఆ క్రెడిట్ పొందేంత అర్హత ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేజిఎఫ్ సినిమా లో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన నటన మన వెంట్రుకలు నిక్కబొడిచేలా చేసాయి. యష్ ఫిట్నెస్, ఫేస్ కట్ కూడా ఓ హీరోకి తగ్గట్లుగానే ఉండటం అతనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆయన అందానికి గుబురు గడ్డం చాలా ముఖ్యమని, కేజిఎఫ్ లో హీరో పాత్రకి ఆ గడ్డం గమనించదగ్గ ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు.



అయితే మరి ప్రస్తుతం హీరో యష్ తన గడ్డాన్ని షేవ్ చేయించుకుంటున్నాడు. వాస్తవానికి ఇంకా కేజిఎఫ్ పార్టు 2 పూర్తయిందని ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ యష్ మాత్రం తన గడ్డాన్ని తీసివేస్తున్న ఫోటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి పలు చర్చలకు దారి తీస్తున్నాడు. యష్ ఎందుకు గడ్డం తీయించుకుంటున్నాడే ప్రశ్న ప్రస్తుతం కన్నడ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా అందరిలో తలెత్తుతుంది.




ఒకవేళ సినిమా షూటింగ్ పూర్తయితే... ఇక హీరో యష్ కు తన గడ్డం ఉంచుకోవాల్సిన అవసరం అంతగా లేదు. మరొక పాసిబిలిటీ ఏంటంటే... కేజిఎఫ్ పార్ట్ 2 సినిమాలోని కొన్ని సన్నివేశాలలో అతను గడ్డం తీసేసి నటించాల్సి వచ్చిందనుకోవచ్చు. కానీ ఎక్కువమంది మాత్రం... కేజిఎఫ్ పార్ట్ 2 సినిమా షూటింగ్ పూర్తయిందని, అందుకే యష్ తన గడ్డాన్ని షేవ్ చేయిస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా కే జి ఎఫ్ పార్ట్ షూటింగ్ పూర్తి అయిపోయిందని తెలిస్తే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పూర్తయితే సినిమా రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేజిఎఫ్ స్టార్ యష్ తన గడ్డం తీసివేస్తున్న ఫోటోలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: