ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య. మజిలీ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత ఈ యువ సామ్రాట్ హీరోగా రూపొందుతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఓ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఆ పాట లిరిక్ వీడియో ను రిలీజ్ చేయనున్నారు.

 

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా  శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ  లవ్ స్టోరీ. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్  సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

 

మ్యూజికల్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ లవ్ స్టోరీ నుండి ఇటీవల విడుదలైన 1 మినిట్ మ్యూజికల్ ప్రివ్యూ ఏయ్ పిల్లా అనే సాంగ్ ప్రివ్యూ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏయ్ పిల్లా ఫుల్ లిరికర్ వీడియోను మర్చి 11న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. హోలీ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న లవ్ స్టొరీ ఈ వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రాబోతున్న ఈ హార్ట్ టచింగ్ ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: