టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. లవ్ స్టోరీస్ లోనే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన చిత్రం బాలీవుడ్ లో కూడా వసూళ్ళ పంట పండించుకుంది. షాహిద్ కపూర్ సినీ జీవితంలోనే ఒక తెలుగు దర్శకుడు తన చిత్రంతో అతనికి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇచ్చాడు అంటే అది మామూలు విషయం కాదు.

 

IHG

 

ఇక చిత్రం లోని బోల్డ్ కంటెంట్ తెలుగులో కన్నా చాలా విచిత్రంగా హిందీ లోనే ఎక్కువగా విమర్శకుల పాలయింది. అందులోని ఒక సీన్ లో హీరో హీరోయిన్ ని అసలు సరైన పరిచయం లేకుండానే ఆమె ప్రమేయం లేకుండానే నేరుగా ముద్దు పెట్టడం... మరియు కోపం వచ్చినప్పుడు కొట్టి వెంటనే హగ్ చేసుకోవడం వంటి సీన్లు అక్కడ భారీ దుమారాన్నే రేపాయి.

 

IHG

 

ఇక విషయానికి వస్తే బాలీవుడ్ లో కథానాయిక పాత్ర పోషించిన కియారా అద్వానీ మన టాలీవుడ్ కి బాగా పరిచయమే. అయితే తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్లాన్స్ మరియు ఎటువంటి వరుడు కావాలి అన్న ప్రస్తావన రాగానే ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇంటర్వ్యూలో చెప్పింది. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఎప్పుడూ సరదాగా ఉండాలి అని మరియు అతనికి ముక్కు మీద కోపం అసలే ఉండకూడదు అని చెప్పింది. అగ్రెస్సివ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు కాకుండా తనకు అలాగే తన అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువిచ్చే వ్యక్తిని తాను కోరుకుంటున్నట్లు కూడా చెప్పింది.

 

IHG

 

దీంతో తన మాటలు విన్న నెటిజన్లు అంతా అర్జున్ రెడ్డి దెబ్బ కియారా పాప కు చాలా గట్టిగానే తగిలిందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అందులో ఆమె తిన్న చెంప దెబ్బ మర్చిపోవడానికి సమయం పట్టిందని ఇక మొగుడు కూడా అలాంటి వాడే వస్తే ఎలాగా అని ఆమె నిర్ణయం తీసుకుందని కూడా జోకులు వేయసాగారు. జోకులు పక్కన పెడితే ఏదైనా అరవింద సమేతలో త్రివిక్రమ్ చెప్పినట్లు అమ్మాయిలకు శాంతంగా ఉంటే వాడు అంటేనే ఇష్టం ఏమో...!

మరింత సమాచారం తెలుసుకోండి: