బాలనటిగా తెలుగు తెరపై కనిపించిన నటి తులసి తర్వాత కొన్ని సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ పాత్రల్లో కనిపించింది.  అప్పట్లో నటీమణులు స్కిన్ షో కన్నా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు.. అలాంటి వారిలో నటి తులసి ఒకరు.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడతూ.. తాను ఇప్పటి వరకు పలు భాషల్లో నటించానని.. బాలనటిగా తనకు మంచి పేరు ఉందని అన్నారు.  మా అమ్మమ్మ వాళ్లు మంచి కలిగిన కుటుంబమే.. చెన్నై వచ్చిన తర్వాత ఆమె తాహతకు తగ్గట్టు పెద్ద ఇల్లు తీసుకున్నాం.

 

ఇంట్లో ఎంతో మంది పనివాళ్లు ఉండేవారు.. వాళ్లకు ఎంతో డబ్బు ఖర్చు అయ్యేది.. అందులోనూ ఆమె చాలా దాన ధర్మాలు చేస్తూ డబ్బంతా హరించుకుపోయింది.  ఈ కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.  అలాంటి పరిస్థితిలో ఓ పెద్ద బ్యానర్ లో నన్ను హీరోయిన్ గా తీసుకుంటామని చెప్పారు.  అయితే ఆ పాత్రలో బాగా స్కిన్ షో చేయాల్సిన పరిస్థితి. దాని కోసం వారు రెమ్యూనరేషన్ కూడా ఎక్కవే ఇస్తామని చెప్పారు.  అప్పుడు మేం ఉన్న ఆర్థిక పరిస్థితులకు అది చాలా ఎక్కువ.. దాంతో మా పెదనాన్న ఒక్కసారి ఆలోచించమని అన్నారు. 

 

అప్పుడు నేను ప్రస్తుతం మనం ఒక్క పూట గంజి తాగుతున్నాం.. అదే రెండు రోజులు సరిపుచ్చుకుందాం.. కానీ అలాంటి ఛండాలమైన పాత్రల్లో మాత్రం నేను నటించనని ఖచ్చితంగా చెప్పాను. ఆ విషయంలో మా ఇంటి వాళ్లు కూడా నన్ను ఏమీ ఫోర్స్ చేయలేదు.. తర్వాత నాకు తగ్గ క్యారెక్టర్స్ చాలా వచ్చాయి.. ఆర్థికంగా సర్ధుబాటు అయ్యాం. అయితే ఒక్కసారి అలాంటి పాత్రల్లో నటిస్తే... అలాంటి వాటికే పరిమితం కావాల్సి ఉంటుంది.. నటనకు ఏమాత్రం ఆస్కారం ఉండదు. ఆ పాత్ర చేయకపోవడం నా కెరియర్ కి మంచిదే అయింది అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: