ప్రపంచగాన్ని ఇప్పుడు భయంకరమైన కరోనా వైరస్ పట్టి పీడిస్తుంది.  మనుషలకు ఇప్పటి వరకు ఎవరికీ లేనంత భయాన్ని పుట్టిస్తుంది.  చైనాలోని పుహాన్ లో మొదలైన కరోనా వైర్ అత్యంత తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిపోయింది.  ఇప్పుడు చైనాలోనే కాదు యావత్ ప్రపంచం కరోనా అంటే వణికి పోతున్నారు.  ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి గురించే మాట్లాడుకుంటున్నారు.  భారత్ లో సైతం ఈ కేసులు నలభై దాటిపోయాయి.  దాంతో ఓ వైపు  కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. 

 

ఫ్రీగా మాస్క్ లు ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశాయి.  అయితే ఈ కరోనాకి ఇంకా మందు కనుగొనలేదు.. జాగ్రత్తలు తీసుకుంటా చాలా వరకు దరికి రాకుండా ఉంటుంది. ఇందుకోసం కొంత మంది సెలబ్రెటీలను తీసుకొని వారిచే కరోనా గురించిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.  కరోనా వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదని, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఓ వీడియో తయారు చేసింది.. ఇందులో భాగంగా హీరో విజయ్ దేవరకొండ కరోనా వైరస్ ను అరికట్టాలంటే.. ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని, ‘నమస్కారం’ చేయాలని, తరచుగా చేతిని సబ్బుతో కడుక్కోవాలని సూచించారు.

 

కళ్లు, ముక్కు, నోటిని, చెవిని చేతితో తాకవద్దని, ఎవరైనా దగ్గుతున్న, తుమ్ముతున్న వారి నుంచి కనీసం 3 అడుగుల దూరంలో ఉండాలని, జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే ఎవరికైనా కరోనా అన్నట్లు అనుమానాలు వస్తే.. ఆ లక్షణాలు గుర్తిస్తే వెంటనే  ‘104’ కు ఫోన్ చేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఈ వీడియోలో మాట్లాడాడు. అసలే కరోనా భయం.. అందులోనూ తమ అభిమాన హీరో ఇచ్చిన సూచనలు రౌడీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: