కొన్ని కాంబినేషన్లు అనగానే ఆటోమేటిక్ గా అవి ఆడియెన్స్ లో ఒక క్రేజ్ ఏర్పరచుకుంటాయి. ఆ క్రేజ్ కు తగినట్టుగానే వాళ్ళ అవుట్ పుట్ కూడా ఉంటుంది. స్టార్ డైరక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ల కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ డైరక్షన్ లో సినిమా అంటే దానికి డిఎస్పి మ్యూజిక్ ఇవ్వాల్సిందే. మిగతా వాళ్ళ సినిమాలు ఎలా సుక్కు సినిమాకు దేవి మ్యూజిక్ అదరగొడతాడు. ఈమధ్య దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ పరంగా చాలా వెనుక పడ్డాడు. తన మార్క్ మ్యూజిక్ అందించడంలో ఎక్కడో తేడా కొడుతుంది.

 

అయినా కూడా స్టార్ అవకాశాలు వస్తున్నాయి. ఇదిలాఉంటే సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలే కాదు సుకుమార్ నిర్మించిన సినిమాలకు దేవి మ్యూజిక్ ఇస్తాడు. కుమారి 21 ఎఫ్ సినిమాకు దేవి మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. లేటెస్ట్ గా సుకుమార్ సపోర్ట్ తో ఉప్పెన సినిమా వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కూడా నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నాడు. దేవి మ్యాజిక్ అందీస్తున్న ఈ సినిమాలోని రెండు సాంగ్స్ రిలీజ్ కాగా అవి హిట్ అయ్యాయి. ముఖ్యంగా లేటెస్ట్ గా వచ్చిన ధక్ ధక్ ధక్ పాత మళ్ళీ పాత దేవిని గుర్తు చేస్తుంది.

 

అంటే సుకుమార్ సినిమా అనగానే దేవి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ పెట్టి కొత్త ట్యూన్స్ ఇస్తాడు. మిగతా వాళ్లకు మాత్రం మమా అనిపించేస్తాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా దేవి మార్క్ మ్యూజిక్ తో మ్యూజికల్ హిట్ సాధించేలా ఉంది. సుకుమార్ అనగానే దేవి తన టాలెంట్ మొత్తం వాడేస్తున్నాడు. ఉప్పెన హిట్ తో దేవి మళ్ళీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: