టాలీవుడ్ సినిమాలను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం కమర్షియల్. కమర్షియల్ సినిమా లు చేస్తూ నిర్మాతలు ఇప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధిస్తున్నారు. చిన్న నిర్మాతలు కూడా భారీగా వసూళ్లు సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు అందరూ ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ నిర్మాతలు ఆలోచించే విధానమే హీరోల ను దర్శకులను భయపెడుతుంది. నిర్మాతలు ఇప్పుడు కాస్త దూకుడుగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే కొన్ని షరతులను దర్శకులకు ఎక్కువగా పెడుతున్నారు. 

 

హీరోలు కూడా ఆ షరతుల దెబ్బకు నలిగిపోతున్నారు. సినిమా చెయ్యాలి అంటే ప్రచారం ఎక్కువగా చెయ్యాలని హీరోకి  షరతు పెడుతున్నారు. కథ లో పట్టు లేకపోయినా పర్వాలేదు సినిమా కమర్షియల్ హంగులతో ఉండాలని చెప్తున్నారు. దీనితో ఇప్పుడు దర్శకులకు హీరోలకు చుక్కలు కనపడుతున్నాయి. ఒక్క సినిమా ఫ్లాప్ అయింది అంటే స్టార్ నిర్మాత ఆ దర్శకుడి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇతర నిర్మాతలు కూడా సినిమా చేయడానికి పెద్దగా ముందుకి రావడం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

ఈ మధ్య కాలంలో సినిమాల్లో కమర్షియల్ హంగులు ఎక్కువైపోయాయి. దర్శకుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఇక ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాతను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కొందరు నిర్మాతలు. సినిమా ఫ్లాప్ అయిన హీరో మీద కూడా తప్పుడు ప్రచారం తర్వాతి సినిమా సమయంలో చేయిస్తున్నారు. దీనితో నిర్మాతలు అంటేనే భయపడే పరిస్థితి టాలీవుడ్ లో నెలకొంది. ఇక పాన్ ఇండియా వైడ్ గా సినిమా ఉండాలీ అనే కండీషన్ కూడా ఎక్కువగా పెడుతున్నారు నిర్మాతలు. దీనితో దర్శకుడు అన్ని భాషలలోను నచ్చే విధంగా సినిమా తీయడానికి కష్టపడుతున్నాడు. ఏది ఎలా ఉన్నా కమర్షియల్ అనే ఆలోచన సినిమాను బాగా ఇబ్బంది పెడుతుంది అనే మాట అక్షరాలా నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: