టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోయిన్ల జోరు బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.  కోలీవుడ్, మాలీవుడ్, శాండివుడ్ నుంచి వరుసగా హీరోయిన్లు వస్తూ జోరు కొనసాగిస్తున్నారు.  కన్నడ బ్యూటీ రష్మిక మందన వరుస విజయాలు అందుకుంటూ టాప్ పొజీషన్లోకి వెళ్తుతుంది.  మాలీవుడ్ నుంచి కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి యంగ్ హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు.  బాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. అయితే రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత వరుసగా నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటుంది... బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే.  నేలటికెట్ సినిమాలో మాస్ మహరాజా రవితేజ సరసన నటించింది హాట్ బ్యూటీ మాళవిక శర్మ.

 

ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు.  కాకపోతే ఈ మూవీలో మాళవిక శర్మ నటన, అందాలు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  తాజాగా రామ్ పోతినేని తో ‘రెడ్’ మూవీలో నటిస్తుంది ఈ అందాల భామ.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నది.   ప్రస్తుతం చాలా మంది అప్ కమింగ్ హీరోయిన్లు ఆడియన్స్ లో మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు ఫోటో షూట్స్ పై ఆధారపడుతున్నారు.  ప్రస్తుతం మాళవిక శర్మ సినిమాల్లో నటిస్తూనే లా పట్టా పుచ్చుకుంది.

 

అంతే కాదు ప్రముఖ క్రిమినల్ లాయర్ పట్టాభి వద్ద శిష్యురాలిగా జాయిన్ అయ్యిందట. షూటింగ్స్ లో ఏమాత్రం విరామం ఉన్నా ఆయన వెంటన కోర్టుకు వెళ్తుందట.  గురువుగారితో కలిసి కోర్టుకు వెళ్తూ అక్కడి వాదనలు వింటున్నది.  అయితే తనకు భవిష్యత్ లో మంచి క్రిమినల్ లాయర్ కవాలని ఉందంటుంది... ఈ బ్యూటీ.  ఒకవేళ సినిమాల్లో పెద్దగా ఛాన్సులు రాకపోయినా.. ఓ న్యాయవాదిగా క్రిమినల్ కేసులు వాదిస్తూ రచ్చ చేయాలనే ఉన్నట్టుంది. ఎందుకంటే క్రిమినల్ లాయర్ అంటే చాలా గడ్స్ ఉండాలన్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: