జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఆయన ఫాన్స్ లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా విడుదల అయ్యే వరకు కూడా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన వేణు శ్రీరాం దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం టాలీవుడ్ జనాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. 2010 నుంచి వచ్చిన సినిమాల్లో ఒకటో రెండో హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా సరైన హిట్ అవ్వలేదు. ఒక్క గబ్బర్ సింగ్, తర్వాత వెంకటేష్ తో చేసిన సినిమా ఒక్కటి మినహా ఏదీ హిట్ అవ్వలేదు. భారీ అంచనాలతో వచ్చిన మూడు నాలుగు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అజ్ఞాతవాసి సినిమా విషయంలో కూడా పవన్ ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  

 

అయినా సరే ఆ సినిమా విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా మీద ఎన్నో భారీ ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్ లో కూడా పవన్ సినిమా విజయం మీద భారీ ఆశలే పెట్టుకున్నారు కొందరు. మరి ఈ సినిమా వారి ఆశలను ఎంత వరకు నెరవేరుస్తుందో చూడాలి. ఇప్పటికే పవన్ సినిమాల విషయంలో ఆయన ఫాన్స్ సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ముందు పవన్ కళ్యాణ్ కంటే వారినే ఎక్కువ తిడుతున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: