రూలర్ సినిమా ఫ్లాప్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీ గా ఉన్నా సరే ఆయన సినిమాలు చేస్తున్నారు. గత రెండేళ్ళు గా బాలకృష్ణ కు సరైన హిట్ లేదు. తన తండ్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక రూలర్ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయింది. ఇప్పుడు బోయపాటి శ్రీనుతో చేసే సినిమా మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

 

గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు రెండు మంచి విజయాలు సాధించాయి. ఈ నేపధ్యంలోనే ఈ సినిమా మీద బాలకృష్ణ కూడా పట్టుదలగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వ‌లో ప్రస్తుతం బాలకృష్ణ... 106 వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు కూడా సిద్దమవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా పూర్తి కాకుండానే బాలకృష్ణ మరో సినిమాను లైన్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

సినీ వ‌ర్గాల స‌మాచారం  మేర‌కు బాలకృష్ణ తో గతంలో లారీడ్రైవ‌ర్‌, రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు  వంటి భారీ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు బి.గోపాల్‌తో బాల‌కృష్ణ త‌న తర్వాతి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ఎప్పుడో చెయ్యాల్సి ఉంది. మే నెల‌లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు నిర్మాతగా బాలకృష్ణ దిల్ రాజు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా మళ్ళీ హిట్ దర్శకుడి తోనే చెయ్యాలని బాలకృష్ణ అనుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: