ఇండియాలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరైనా ఉన్నారంటే సల్మాన్‌ ఖాన్‌ అని చెప్పాలి. కండల వీరుడు పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెబితే క్యూ లైనులో నిలబడే మహిళలు ఎంతోమంది ఉంటారని చెబితే అతిశయోక్తి కాదు. ఆల్రెడీ ఈ హీరోకి 54 ఏళ్లు వచ్చేశాయి.  బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్యూలో పిల్లలు కావాలి.. కానీ భార్య వద్దూ అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.  బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో కొంత సమయాన్ని గడిపేస్తాడు. చెల్లెలి కుటుంబంతో టైమ్ గడుపుతూ అల్లుడుతో ఆడుకుంటాడు.

 

సోదరి అర్పితా ఖాన్ తాజాగా షేర్ చేసిన మామ కోడలు చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  పిల్లలపై భాయిజాన్‌కు ఉన్న ప్రేమను చూసి ఆయన చెల్లెలు అర్పితా ఖాన్‌ అన్నయ్య కోసం తన కూతురు(అయాత్‌)ను దత్తత ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అన్నయ్య పుట్టిన రోజు నాడే అయాత్‌కు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే సల్మాన్‌ బర్త్‌ డే(డిసెంబర్‌ 27)న ఆడబిడ్డకు జన్మనిచ్చి బహుమతిగా ఇచ్చారు ఆర్పితా దంపతులుతాజాగా కోడలు అయాత్‌పై భాయిజాన్‌ ముద్దుల వర్షం కురిపిస్తూ.. చిన్నారితో ఆడుకుంటున్న వీడిమోను ఆర్పితా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

 

సల్మాన్ తన సోదరి అర్పిత వివాహాన్ని.. హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా జరిపించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుఖ్ రామ్ మనవడైన ఆయుష్ శర్మను పెళ్లాడిందామె.  సల్మాన్‌ తన ముద్దుల కోడలికి పదే పదే ముద్దులు పెడుతూ.. తనతో ఆడుకుంటున్న ఈ వీడియోకు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ‘వావ్‌.. అయాత్‌ ఎంత ముద్దుగా ఉంది’, ‘మామకు కోడలంటే ఎంత ఇష్టమో’ అంటూ నెటిజన్లు హార్ట్‌ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: