ట్రిపుల్ ఆర్ తో పోటీ పడి ఎందుకని.. బన్నీముందే తప్పుకొని.. దసరాకు.. లేదంటే క్రిస్మస్ కు వచ్చే ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో నడుస్తూ దీపావళికి వచ్చేస్తున్నాడు. రాజమౌళితో పోటీ ఎందుకన్న కాన్సెప్ట్ తో స్టార్స్ ఉంటే.. ఓ సీనియర్ హీరో మాత్రం ఢీ అంటున్నాడు. పెద్దగా క్రేజ్ లేని ఆ సీనియర్ హీరో ఆలోచన మరోలా ఉంది. మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ తో పోటీపడుతున్న ఆ సీనియర్ ఎవరో తెలుసా.. !

 

ట్రిపుల్ ఆర్ 2021 సంక్రాంతికి.. జనవరి 8న రిలీజ్ అవుతోంది. ఇదొచ్చిన వారం రోజులకు నాగార్జున బంగార్రాజుగా వద్దామని ప్లాన్ చేశాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఎదురు చూసే రాజమౌళి సినిమాతో నాగార్జునకు పోటీనా.. అనే అనుమానం వచ్చినా.. మన్మథుడికి ఉన్న ఆ లెక్కే వేరు. సోగ్గాడే చిన్ని నాయనాతో నాగార్జున ఫస్ట్ టైమ్ 50కోట్ల మార్క్ దాటాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా.. సోగ్గాడే చిన్నినాయనను క్రాస్ చేయలేకపోయింది. నాగ్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సోగ్గాడే 2016 సంక్రాంతికి రిలీజ్ కావడంతో.. సీక్వెల్ బంగార్రాజును కూడా అదే పండక్కి రిలీజ్ చేయాలన్న పట్టుదలతో నాగార్జున ఉన్నాడట. 

 

సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ బంగార్రాజు కథను దర్శకుడు కల్యాణ్ కృష్ణ రెండేళ్ల నుంచి వండుతూనే ఉన్నాడు. తనకు సంతృప్తి అనిపించేంతవరకు మార్పులు చేర్పులు చెబుతూనే ఉన్నాడు నాగార్జున. దీంతో ఎప్పుడో మొదలు కావాల్సిన బంగార్రాజు ఎట్టకేలకు జూన్ లో సెట్స్ పైకి వస్తోంది. ఇందులో నాగచైతన్యతో పాటు రమ్యకృష్ణ ఇప్పటి వరకు ఎంపికైన తారాగణం. 

 

ట్రిపుల్ ఆర్ ను బంగార్రాజు ఢీకొట్టడానికి నాగ్ దగ్గర ఓ బలమైన కారణం ఉంది. ట్రిపుల్ ఆర్ 8న వస్తుంటే.. ఇదొచ్చిన వారం తర్వాత బంగార్రాజును రిలీజ్ చేస్తారు. సంక్రాంతి బరిలో రెండు మూడు సినిమాలు ఉన్నా ప్రేక్షకులు చూస్తారు. ట్రిపుల్ ఆర్ ను చూసిన ప్రేక్షకులను మరో ఆప్షన్ లేదు. బంగార్రాజు రూపంలో మరో ఆప్షన్ ఇచ్చి.. బాక్సాఫీస్ ను దోచుకోవాలన్న మాస్టర్ ప్లాన్ నాగార్జునది. 

మరింత సమాచారం తెలుసుకోండి: