మంచువారబ్బాయి మనోజ్, మొదటగా సదా హీరోయిన్ గా నటించిన దొంగ దొంగది సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆతరువాత నుండి  వరుసగా అవకాశాలతో దూసుకెళ్లిన మనోజ్, ఆపై మధ్యలో కొన్ని అపజయాలతో పాటు కొన్ని సక్సెస్ లు కూడా అందుకున్నారు. మొదటి నుండి తన సినిమాలను రెగ్యులర్ ఫార్ములా కథలకు కొంత విభిన్నంగా ఉండేలా చూసుకునే అలవాటున్న మనోజ్, మూడేళ్ళ క్రితం వచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమా తరువాత కొంత విరామం తీసుకున్నారు. 

 

ఇక ప్రస్తుతం మూడేళ్ళ తరువాత తొలిసారిగా తాను నెలకొల్పిన ఎమ్ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై అహం బ్రహ్మాస్మి సినిమాని నిర్మిస్తున్నారు మనోజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా కోలీవుడ్ నటుడు సముద్ర ఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక మొదటి నుండి ఆయన తండ్రి మోహన్ బాబు సహా మంచు ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ తో మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక గతంలో కూడా వీరిరువురి ఫ్యామిలీలు కలిసి సందడి చేసిన పలు వేడుకలను మనం గమనించవచ్చు. ఇక ఇటీవల మనోజ్ ప్రారంభించిన ఎమ్ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ ఫస్ట్ మూవీ అహం బ్రహ్మాస్మి సినిమా ఓపెనింగ్ రోజున ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల, మంచు లక్ష్మి తో కలసి ఆ మూవీ ఫస్ట్ షాట్ కు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. 

 

ఇక నేడు సుస్మిత జన్మదినం సందర్భంగా మనోజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే సుస్మిత అక్క, నా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి ఫస్ట్ షాట్ కి కెమెరా స్విచ్ ఆన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మనోజ్ పోస్ట్ చేసారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: