మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమా కోసం చాలా టైం తీసుకుని సినిమా రిలీజ్ చేయగా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. సౌత్ ఇండియాలో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య విడుదలైన సైరా సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో చిరంజీవి యాక్షన్ బాగున్నా గాని...సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కడం తో పెద్దగా రాణించలేకపోయారు అని చాలా మంది సినిమా యొక్క రిజల్ట్ ఉద్దేశించి అప్పట్లో కామెంట్ చేశారు. ఇదిలావుండగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నా ఆచార్య సినిమా విషయంలో కొంచెం నెగటివ్ కామెంట్స్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. టైటిల్ ఏమాత్రం వాడుకలో లేనిది కావడంతో రకరకాల వార్తలు టైటిల్ పై వినబడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే ఆచార్య సినిమా ఒక పిరియాడిక్ ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పాటుగా 1990ల బ్యాక్ డ్రాప్ లో దేవాలయాల విషయంలో జరిగిన ఓ సోషల్ క్రైమ్ ని బేస్ చేసుకొని ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు అట కొరటాల శివ. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్టిల్ ఒకటి ఇటీవల రిలీజ్ అయింది. ఇదొక పీరియడ్ ఫిల్మ్ కావడం వలనే హీరోయిజం ఎలివేట్ అయ్యే మరో పాత్ర కోసం అప్పట్లో మంచి రెబల్స్ అయిన నక్సలైట్ పాత్రని మొదటగా రామ్ చరణ్ కి డిజైన్ చేశారట.

 

కానీ రామ్ చరణ్ కి కుదరకపోవడంతో మహేష్ బాబు లైన్ లోకి వచ్చాడు. దాంతో మహేష్ కోసం అప్పట్లో క్రేజ్ ఉన్న స్టూడెంట్ లీడర్ పాత్రగా మార్చారట. మరి సినిమాలో మహేష్ నటిస్తున్నాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఎక్కడో ఎప్పుడో దేవాలయ భూములకు సంబంధించి పిరియాడిక్ ఫిలిం చేస్తున్నట్లు ఛాయలు కనపడటంతో ఎందుకు ఇలాంటి సినిమాలు తీయడం బ్యాడ్ డెసిషన్ అంటూ చిరంజీవి ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: