సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం సాధారణమే.. కేవలం రాజకీయాల్లోకి రావడమే కాదు.. ఏకంగా ముఖ్యమంత్రులు అయినవాళ్లూ ఉన్నారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఇందుకు ఉదాహరణలు. రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న తమిళనాడులో సినీ ప్రభావమూ చాలా ఎక్కువే. అలాంటి రాష్ట్రాన్ని జయలలిత దశాబ్దాల తరబడి ప్రభావితం చేశారు. పాలించారు. తమిళుల గుండెల్లో నిలిచిపోయారు.

 

 

అసలు ఓ సినిమా హీరోయిన్ ఆ తర్వాత కాలంలో అంత చక్కటి రాజకీయ వేత్త అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతగా ఆమె తన రాజకీయ చతురతతో రాణించారు. అయితే అప్పట్లో జయలలిత కాబట్టి అన్ని ఆటుపోట్లు తట్టుకుని నిలబడింది. మరి తమిళనాడుకు మరో సినీ హీరోయిన్ సీఎం అవుతుందా.. అయ్యే అవకాశం ఉందా..?అవుతుందో లేదో తెలియదు కానీ అవ్వాలనే కోరిక మాత్రం ఓ సీనియర్ హీరోయిన్ లో కనిపిస్తోంది.

 

 

ఇంతకీ ఎవరు ఆమె అంటారా.. ఆమే ఖుష్బూ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కోరిక బయటపెట్టింది. మీరు మంచి నటి, మంచి నిర్మాత. భవిష్యత్‌లో మంచి సీఎం అయ్యే అవకాశం ఉందా అని అడిగితే.. ఆమె చెప్పిన సమాధానం చూస్తే.. ఏమో ఆమె తమిళనాడు సీఎం కావొచ్చేమో అనిపించింది. ఇంతకీ ఖుష్బూ ఏం చెప్పిందో తెలుసా. నేను సీఎం అవుతానో లేదో.. తెలియదండీ. అలా అనుకోవడం చాలా తొందరపని అవుతుంది. అయితే, సమాజానికి ఏదైనా మంచి చేయాలని మాత్రం ఉంటుంది. రాజకీయాల్లో లేకపోయినా చేస్తా. నేను సీఎం అవుతానా? లేదా? అన్నది నా చేతుల్లో లేదు. ఏదైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. అని చెప్పారు ఖుష్బూ.

 

ఖష్బూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ కు తమిళనాడులో అంత సీన్ లేదు. అయితే ప్రస్తుతం దిగ్గజాలైన జయలలిత, కరుణానిధి మరణంతో అన్నాడీఎంకే, డీఎంకే అంత యాక్టివ్ గా లేవు. మరో వైపు రజినీకాంత్, కమల్ హాసన్ పార్టీలు పెట్టి రాజకీయాల్లో దిగారు. ఇలాంటి సమయంలో ఖుష్బూకు ఆ ఛాన్స్ ఇస్తారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: