నేచురల్ స్టార్ నాని సరసన నటించిన హీరోయిన్స్ అందరూ దాదాపు సెటిలయినవాళ్ళే. ఒకళ్ళో ఇద్దరో తప్ప. అయితే వాళ్ళు ఇంకా సినిమాలనే ట్రై చేసుకుంటున్నారు తప్ప ఇంకో వ్యాపారంలోకి దిగలేదు. కాని ఒక హీరోయిన్ మాత్రం షాకిచ్చింది. నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రద్దా శ్రీనాథ్. ఆ సినిమా ఈ బ్యూటీకి హీరోయిన్ గా మంచి పేరే తెచ్చింది. అంతేకాదు నాని కూడా ఈ అమ్మడు గురించి బాగానే పొగిడాడు. స్టార్ హీరోయిన్ అవుతుందని కితాబిచ్చాడు. సాధారణంగా నాని అన్నాడంటే నిజంగా ఆ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్ళు నిలబడుతుంది. అందుకు ఉదాహరణ నివేదా థామస్ అని చెప్పాలి. మెహరీన్ కూడా నాని తో మొదటి సినిమా చేసి తర్వాత టాలీవుడ్ లో చాలా సినిమాలే చేసింది.

 

అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మాత్రం కాలేకపోయారు. వీళ్ళే కాదు నాని సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్స్ కి వరుసగా అవకాశాలు వస్తాయి గాని స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎందుకనో సెటిలవరు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ గురించి చెప్పాలంటే వీళ్ళ తో అసలు పోల్చలేమని చెప్పాలి. ఇప్పటి వరకు నాని సరసన నటించిన ఒక్క శ్రద్ధా శ్రీనాథ్ మాత్రమే మళ్ళీ సినిమాలు దక్కించుకోలేపోయింది. జెర్సీ లో మంచి పర్ఫార్మెన్స్ చేసిందని మూడు నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయని అప్పట్లో చెపుకుంది. కానీ కట్ చేస్తే సినిమా అంతలేదని అర్థమైంది.

 

అందుకే కొంతమంది హీరోయిన్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంది ఈ బ్యూటి. రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ-ఇలియానా- మాధవీలత ల మాదిరిగానే శ్రద్ధా శ్రీనాథ్ కూడా కొత్తగా బిజినెస్ మొదలు పెట్టింది. రీసెంట్ గా చెన్నై లో కొత్త సలాడ్ బార్ & కేఫ్ ను ప్రారంభించింది. మరి సినిమాలలో సక్సస్ కాని శ్రద్ధా శ్రీనాథ్ బిజినెస్ లో సక్సస్ అవుతుందా చూడాలి. ఎందుకంటే కొంతమందికి బిజినెస్ కలిసిరాదు. ఘోరంగా దెబ్బ తింటారు. మరి ఈ అమ్మడికి కలిసొస్తుందా లేదా చూడాలి. ఇక శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం 'కృష్ణ అండ్ హిజ్ లీలా' అనే సినిమా తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సరసన చక్ర అనే సినిమాలో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: