శోభన్ బాబు.. తెలుగు తెరపై దశాబ్దాల పాటు మెరిసిన అందగాడు.. శోభన్ బాబు పేరు చెప్పగానే మనకు అలా రింగులు తిరిగిన క్రాపుతో అందమైన ముఖమే గుర్తొస్తుంది. ఆయన వృద్దాప్యంలోనే మరణించినా... ఆయన వృద్దాప్యంతో ఉన్న ఫోటోలు మీకు ఎక్కడా కనిపించవు.. ఎందుకో తెలుసా.. ఆయన అందంగా ఉన్న సమయంలోనే సినిమాల నుంచి విరమించుకున్నారు.. అంతే కానీ ముసలీ ముతకా వేషాలు వేసుకుంటూ సినీ పరిశ్రమలోనే ఉండిపోలేదు.

 

 

ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే పరుగు తీయడమే కాదు.. ఆ పరుగు ఎప్పుడు ఆపాలో తెలియడం కూడా ఓ కళే. అది శోభన్ బాబును చూసి సినిమా వాళ్లు నేర్చుకోవాలి. అంతే కాదు.. శోభన్ బాబు సినిమాల్లో కోట్లు సంపాదించినా... ఆయన చాలా పొదుపుగానే బతికారు. అంతే కాదు. ఆయన తన సంపాదనను రియల్ ఎస్టేట్ లో పెట్టేవారు. ఇప్పటికీ చెన్నైలోని చాలా డిమాండ్ ఉన్న స్థలాలు ఆయన కుటుంబానికి చెందినవే అంటారు.

 

 

అంతే కాదు.. శోభన్ బాబు ఈ సూత్రాన్ని తన సహనటులకూ చెబుతుండేవారు. అందుకు ఉదాహరణే.. మురళీ మోహన్.. శోభన్ బాబు పదే పదే చెప్పిన తర్వాతే తాను రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టానని మురళీ మోహన్ చెప్పేవారు. భూమిపై పెట్టిన పెట్టుబడి ఎక్కడికీ పోదని.. సంపాదించే సమయంలోనే భూములు కొనుక్కోవాలని శోభన్ బాబు చెప్పిన సూత్రాన్ని మురళీ మోహన్ ఆచరణలో పెట్టారు.

 

 

అందుకే మురళీ మోహన్ జయభేరి సంస్థ పేరుతో హైదరాబాద్ లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. వందల ఎకరాలు కొన్నారు. ఆ తర్వాత ఆయన కొన్న భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అలా శోభన్ బాబు తన సలహాలతో మురళీ మోహన్ జీవితాన్ని మార్చేశారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: