ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మనిషి యొక్క జీవితంలో రోజురోజుకీ ఎన్నో కొత్త రకాల పోకడలు మొదలవుతున్నాయి. మనిషి ఆలోచనలు వేగంగా ముందుకు సాగటంతో పాటు, టెక్నాలజీ కూడా మరింత వేగంగా దూసుకెళుతోంది. నిత్యం ఎక్కడో చోట ఏదో ఒక వినూత్న ఆవిష్కరణ జరగటం చోటు చేసుకుంటూనే ఉంది. టెక్నాలజీ పరంగా ఈ విధంగా సరికొత్త మార్పులు చోటుచేసుకోవడం మనిషికి చాలావరకు ఉపయోగకరం గానే ఉన్నప్పటికీ, ఆ టెక్నాలజీ తో పాటు వినూత్న సాధనాలు వలన కొంత సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల మొబైల్ ఫోన్లు వంటివి రానురాను సరి కొత్త పుంతలు తొక్కుతూ అత్యల్ప ధరలకే సామాన్యులకు సైతం అందుబాటులోకి వస్తుండటం, అలానే వాటిని కొనుగోలు చేసిన వారు తమకు తోచిన ప్రతి ఒక్క విషయాన్ని ఫోటోలు, వీడియోలు తీస్తూ వాటిని షేర్ చేయటం అలవాటైపోయింది. 

 

ఇక ప్రస్తుత ఈ పరిస్థితి సెలబ్రిటీలకు, మరీ ముఖ్యంగా సినిమా పరిశ్రమ వారికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎక్కడైనా ఎవరైనా ఒక సినిమా సెలబ్రిటీ కనపడితే చాలు, వారు నిలబడినా, నుంచున్నా లేదా మరేదైనా పనిచేస్తున్నా సరే వెంటనే వారి యొక్క ఫోటోనో, వీడియోనో తీసి వాటిని సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్లోడ్ చేయటం పరిపాటి అయిపోయింది. దానితో కొందరు సినిమా ప్రముఖులు బయటకు రావాలంటేనే విసుగు చెందుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ విధంగా సెల్ ఫోన్లతో తమ ఫోటోలు, వీడియోలు తీస్తూ తమ ప్రైవసీని దెబ్బ తీస్తున్న వారిపై అక్కడక్కడ కొందరు సినిమా ప్రముఖులు నిరుత్సాహపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. 

 

నిజానికి ప్రస్తుత పరిస్థితి ఎలా తయారయింది అంటే, ప్రశాంతంగా నిలబడటానికి వీల్లేదు, కూర్చోవడానికి వీలులేదు సరి కదా, కనీసం ఎక్కడైనా ఏదైనా ప్రశాంతంగా తినటానికి కూడా వీలు లేదు అనే విధంగా మమ్మల్ని వేపుకు తినేస్తున్నారనుకోండి, ఎప్పుడూ మమ్మల్ని ఫోటోలు వీడియోలు తీస్తూ ఉండడమే తప్ప వేరే ఏమీ లేదా అంటూ అటువంటి వారిపై మరింత మండిపడుతున్న నటీనటులు కూడా ఉన్నారు. ఏది ఏమైనా టెక్నాలజీ అనేది ప్రస్తుత కాలంలో ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదుగానీ ఈ విధంగా సినిమా నటుల పాలిటి శాపంగా మాత్రం తయారైందని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: