ప్రస్తుతం వరుసగా ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తం పడిపోయి ధీన పరిస్థితిలో ఉన్నాడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా నుండి ఇక బయటి రావా అంటూ రీసెంట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు విజయ్ ని నానా రకాలుగా కామెంట్స్ చేశారు. ఒక్క గీత గోవిందం తప్ప అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన చాలా సినిమాలలో అదే తరహా యాక్టింగ్ ని రిపీట్ చేస్తుండటం విజయ్ ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి బాగా కాలిపోతుంది. ఏ సినిమాలో చూసిన అదే ఫ్లేవర్ అదే యాటిట్యూడ్, అదే బాడీ లాంగ్వేజ్ తో చిర్రెత్తిస్తున్నాడు. దాంతో వరుసబెట్టి విజయ్ సినిమాలు డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి.

 

అయినా కూడా పూరి జగన్నాధ్ ఇవేమి పట్టించుకోకుండా విజయ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని పూరి జగన్నాధ్ డిసైడయ్యాడు. అందుకే తనతో సినిమా ప్లాన్ చేశాడు పూరి. అయితే ఇక్కడ పూరి చేసిన పెద్ద తప్పు ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని. అదే ఇప్పుడు పూరికి తలనొప్పులు తీసుకువస్తుంది. ఉన్నచోట తిన్నగా ఉండి ఒక్క తెలుగులోనే గనక సినిమాని తీస్తుంటే మరో రెండు నెలల్లోపే విజయ్ సినిమాని రిలీజ్ చేసేవాడు. కానీ ఎప్పుడైతే హిందీ తమిళ్ అంటూ బయలుదేరాడో అప్పుడే సమస్యలు మొదలైయ్యాయి.

 

ముఖ్యంగా ఇక్కడ టైటిల్ కి సంబందించిన ఇష్యుస్ బాగ వస్తున్నాయట. పూరి వాస్తవంగా ఈ సినిమాకి ఫైటర్ అన్న టైటిల్ ని ఫిక్స్ అవ్వాలనుకున్నాడు. అదే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు కూడా. అయితే ఈ టైటిల్ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కి నచ్చలేదట. దాంతో లైగర్ అన్న పేరు తెరమీదకొచ్చింది. కానీ అదీ కూడా వద్దని చెప్పాడట. అంతేకాదు ఈ విషయంలో విజయ్ కూడా అటు కరణ్ జోహార్ కే సపోర్ట్ చేస్తూ పూరిని విసిగిస్తున్నాడట. దాంతో విజయ్ మీద పూరికి బాగా కాలుతోందట. ఇలానే చేస్తే పూరికి తిక్క రేగి విజయ్ కి చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: