దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. సినిమా రంగంలో వెండితెర రారాజుగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే తిరుగులేని రికార్డ్ సొంతం చేసుకున్నారు. వెండితెర పై ఒక రాముడిగా, కృష్ణుడిగా, ఒక దుర్యోధనుడిగా, ఒక విశ్వామిత్రుడిగా, ఒక రావణాసురుడిగా, ఒక కర్ణుడిగా ఇలా చెప్పుకుంటూ పోతే సంగీతంలోనూ తిరుగులేని పాత్రలో నటించిన ఎన్టీఆర్ 1982లో నాటి కాంగ్రెస్ పాలనపై విసిగి పోయి తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి అధికారంలోకి రాగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ 1983 నుంచి 1994 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసి ఎనిమిది చోట్ల విజయం సాధించారు.

 

 కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ తెలంగాణ ఇలా నాలుగు ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక రాజకీయ నాయకుడు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే 1983లో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గుడివాడ తిరుపతి లో విజయం సాధించారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గుడివాడ హిందూపూర్ , నల్లగొండ నుంచి పోటీ చేసి మూడు చోట్ల అప్రతిహత విజయం సొంతం చేసుకున్నారు. 1989లో హిందూపూర్ లో విజయం సాధించగా కల్వకుర్తిలో మాత్రం ఓడిపోయారు.

 

 1994లో హిందూపూర్ టెక్కలి లో పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. ఏదేమైనా నా తెలుగు గడ్డ పై ఏకంగా నాలుగు ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత మహామహులు అయిన రాజకీయ నేతల కే సాధ్యం కాలేదు. అయితే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ నాలుగు ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎప్పటికీ తిరిగి లేని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: