తెలుగు సినిమా రంగానికి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్న మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు వరకు సినిమా వాళ్లకు రాజకీయాల్లో అంతగా గుర్తింపు లేదన్నది వాస్తవం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమా రంగంలో ఆయనతో పోటీ పడిన సూపర్ స్టార్ కృష్ణ సైతం ఎన్టీఆర్ కు పోటీగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఘట్టమనేని కృష్ణ తొలి ప్రయత్నంలోనే ఎంపీగా విజయం సాధించి ఢిల్లీకి వెళ్లారు. కృష్ణ తొలి సారి పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్ కి పోటీ అంటూ ప్రచారం జరగడంతో తిరుగులేని విజయం సాధించారు. ఆయన ఎంపీగా గెలిచిన ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఆ మరుసటి ఎన్నికల్లోనే ప్రజలు చిత్తుగా ఓడించారు. టిడిపి నుంచి ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో కృష్ణ పై పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి గొళ్ళ‌బుల్లి రామయ్య విజయం సాధించారు.

 

ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత కృష్ణ రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారు. వెండితెరపై ఎన్టీఆర్ కు పోటీగా సూపర్ స్టార్ కృష్ణ గా ఓ వెలుగు వెలిగిన ఆయన రాజకీయంగా మాత్రం అట్టర్ ప్లాప్ స్టార్ అన్న ముద్ర వేయించుకున్నారు. ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రాజకీయాలకు ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉంటూ వచ్చారు. అయితే మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు. బావ కోసం మహేష్ ప్రత్యక్ష ప్రచారం చేయకపోయినా 2014 ఎన్నికల్లో మాత్రం పరోక్షంగా తన బావ కోసం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. అలా గుంటూరు జిల్లాలో మహేష్ అభిమానుల ఓటింగ్ కూడా నాడు జయదేవ్ గెలుపునకు కారణమైంది.

 

ఇక జైదేవ్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన గుంటూరు ఎంపీగా ఆయన వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు మహేష్ అభిమానుల ఓటింగ్‌తో వరుసగా రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. ఏదేమైనా ఘట్టమనేని ఫ్యామిలీ కి రాజకీయాలు అంతగా క‌లిసి రాలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: