అవసరం ఎవరినైనా మార్చేస్తుంది. అదే అవసరం తీరాక వాళ్ల అసలు రూపం బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కూడా ఇలాగే తెలుగు అవసరం తీరిపోయాక, తెలివితేటలు చూపిస్తోంది. సౌత్ అంటే ఓవర్ యాక్షన్ అన్నట్టు బిహేవ్ చేస్తోంది. 

 

పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమాతో కెరీర్ స్టార్ చేసింది నికీషా పటేల్. అయితే ఆ తర్వాత హిట్ లేకపోవడంతో నికీషా స్లంపులో పడింది. తెలుగు, తమిళ్, కన్నడ అంటూ సౌత్ మొత్తం తిరిగినా సక్సెస్ రాలేదు. ఈ ఫ్లాపుల దెబ్బకు పుట్టిన దేశం ఇంగ్లాంక్ వెళ్లింది ఈ ఎన్.ఆర్.ఐ పాప.

 

ఇండియన్ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోగానే, ఇక్కడి సినిమాలను విమర్శిస్తోంది నికీషా. సౌత్ సినిమాల్లో నటించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని చెప్పింది. హాలీవుడ్ సినిమాల కోసం ట్రై చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావని రిజక్ట్ చేశారని చెప్పింది. దీంతో మళ్లీ యాక్టింగ్ స్కూల్ జాయిన్ అవ్వాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నికీషా. 

 

నికీషా సౌత్ సినిమాలు, ఓవర్ యాక్టింగ్ గురించి మాట్లాడటంతో నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా రాణిస్తారు. కంటెంట్ లేకుండా కేవలం కలరింగ్ తోనే నెట్టుకురావాలంటే కష్టం. అయినా నీకు యాక్టింగ్ వచ్చి ఉంటే మళ్లీ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అవ్వాల్సిన పనిలేదని ట్రోల్ చేస్తున్నారు. 

 

అవకాశం ఇచ్చినపుడు వాడుకొని.. ఇపుడు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో సౌత్ ఇండస్ట్రీని ఓవర్ యాక్షన్ గా సంభోదించడంపై సినీ జనాలు మండిపడుతున్నారు. ఇది పద్దతి కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా రాణించగలరనీ.. అది లేకపోతే ఎక్కడా నెగ్గుకు రాలేరంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ అంటూ ఇలా సౌత్ మొత్తం తిరిగినా ఎక్కడా సక్సెస్ దక్కకపోవడం ఇపుడు ఇంగ్లండ్ వెళ్లిపోయింది. అవసరం తీరిపోయింది కాబట్టి సౌత్ పై కామెంట్స్ ఎక్కుపెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: