కొరటాల చిరంజీవి ల ‘ఆచార్య’ మూవీకి మహేష్ విషయంలో కొనసాగుతున్న పీటముడికి ఎన్నో ఆలోచనలు చేసినా పరిష్కారాలు దొరకడం లేదు అని టాక్. ఈ మూవీలో చరణ్ ను ప్రత్యేక పాత్రలో నటించే విషయంలో రాజమౌళి అనుమతుల కోసం మెగా కాంపౌండ్ మరొకసారి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.


దీనితో ఈ సినిమాకు సంబంధించి ఎన్ని ఆలోచనలు చేసినా ఇక చిరంజీవి వద్ద రెండు పరిష్కారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని అంటున్నారు. ఈ మూవీ ప్రాజెక్ట్ కాస్ట్ ను పరిగణలోకి తీసుకోకుండా మహేష్ ను ధ్యైర్యంగా తీసుకోవడం లేదంటే వచ్చే ఏడాది ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యే వరకు’ఆచార్య’ విడుదల వాయిదా వేయడం తప్ప మరొక మార్గం చిరంజీవి దగ్గర లేదు అని అంటున్నారు.


ఈ మూవీలో మహేష్ ను ప్రత్యేక పాత్రకు ఎంపిక చేస్తే ఈ మూవీకి ఏర్పడే బడ్జెట్ రీత్యా వచ్చే సమస్యల కంటే మరొక విచిత్రమైన సమస్య చిరంజీవిని భయపెడుతోంది అని అంటున్నారు. ఈ మూవీలో చరణ్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన ప్రత్యేక పాత్రను హైలెట్ చేస్తూ కొరటాల చాల పవర్ ఫుల్ డైలాగ్స్ వ్రాసినట్లు తెలుస్తోంది.


ఇప్పుడు ఆ డైలాగ్స్ అన్నీ మహేష్ తో చెప్పిస్తే మహేష్ కు ఉన్న సూపర్ స్టార్ ఇమేజ్ రీత్యా తన పాత్ర స్థాయి తగ్గుతుందా అన్న భయాలు కూడ చిరంజీవిని వెంటాడుతున్నట్లు టాక్. ఇలా ఒకవైపు బడ్జెట్ సమస్యలు మరొక వైపు మహేష్ తో కలిసి నటిస్తే వచ్చే డామినేషన్ సమస్యలు అదేవిధంగా మహేష్ కు చిరంజీవికన్నా ఓవర్సీస్ లో ఎక్కువగా ఉన్న పాపులారిటీ లాంటి సున్నిత విషయాలు ఇలా అన్నీ చిరంజీవిని కన్ఫ్యూజ్ చేస్తూ ‘ఆచార్య’ ను రోజులు గడిచే కొద్ది పెండింగ్ లో పెట్టేస్తున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారంతో ఇండస్ట్రీ హోరెత్తి పోతోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: