టాలీవుడ్ లో జయంతో ప్రస్థానం మొదలు పెట్టిన నితిన్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు.  అయితే కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ ఏదీ పడలేదు.. కానీ ఈ హీరో ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.  నితిన్ ఎప్పుడు తన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూస్తుంటారు.  ఈ మద్య నితిన్ వివాహం ఖాయమైంది.  ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిది.  గత కొంత కాలంగా నితిన్ కి వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు.  ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ‘భీష్మ’ సూపర్ హిట్ అయ్యింది. 

 

నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించింది.  ఈ మూవీ సేంద్రీయ ఎరువులకు సంబంధించిన కథ.. రైతు సమస్యలపై మరో మంచి సబ్జెక్ట్ కావడంతో మంచి విజయం అందుకుంది.  రోటీన్ కి భిన్నంగా రైతు సమస్యలపై వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  తాజాగా భీష్మ కూడా మంచి హిట్ అయ్యింది. అయితే లాభాల పంట పట్టే సమయంలోనే అనుకోకుండా కరోనా ఎఫెక్ట్ తో కాస్త ఇబ్బందులు పడుతున్నట్లే ఉంది.  భీష్మ హిట్ తో నితిన్ ‘రంగ్ దే’ సినిమాకు రెడీ అవుతున్నాడు.

 

'రంగ్ దే' షూటింగులో నితిన్ ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఇది కూడా పూర్తిస్థాయి ప్రేమకథా మూవీ కావడం విశేషం.  వెంకీ అట్లూరి  దర్శకత్వంలో ‘రంగ్ దే’ మూవీ లో నటిస్తున్నాడు.  ఈమూవీలో నితిన్ సరసన మాలీవుడ్ బ్యూటీ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. జూన్ నాటికి ఈ సినిమా షూటింగును పూర్తి చేసి, జూలై చివరిలోగానీ, ఆగస్టు మొదటివారంలో గాని విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.  ఈ సినిమా హిట్ అయితే నితిన్ ఇక లైన్లో పడ్డటే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: