జయప్రద... తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఆమె. ఎందరో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఆమె. శోభన్ బాబు, ఎన్టీఆర్, అక్కినేని ఇలా దాదాపు అందరి హీరోల పక్కన ఆమె ఆడిపాడింది. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ శాత౦ విజయం సాధించినవే. అగ్ర హీరోయిన్ గా... పారితోషికం కూడా అదే స్థాయిలో తీసుకునే వారు ఆమె. హీరోలతో సమానంగా ఆమెకు పారితోషికం ఇచ్చే వారు నిర్మాతలు. ఆ విధంగా తెలుగు సినిమాలో తన ముద్ర వేసారు. 

 

ఆ తర్వాత ఎన్టీఆర్ ఆహ్వానం తో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు జయప్రద. 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశ౦ చేసారు. చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరిన ఆమె ఆ తర్వాత తెలుగు మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి రాజకీయాల్లో ఆమెకు తిరుగులేకుండా పోయింది అనే చెప్పాలి. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశము పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన విభేదాలతో ఆమె పార్టీకి రాజీనామా చేసి కొంత కాలం పాటు సైలెంట్ అయ్యారు. 

 

ఇక ఆ తర్వాత అనూహ్యంగా అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13 న లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇక అక్కడి నుంచి ఆ పార్టీలో ఆమె ప్రస్తానం మొదలయింది. రాజకీయంగా ఆమె అక్కడ చక్రం తిప్పారు. కీలక నేతలకు ఆమె దగ్గరయ్యారు. ఇప్పుడు రాజకీయాలకు ఆమె దూరంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: