మురళీ మోహన్ మంచి నటుడు. ఈయిన 1973 నుండి సినిమాలలో నటించడం ప్రారంభం చేసాడు. జగమే మాయ, నేరము-శిక్ష, తిరుపతి, రాదమ్మ పెళ్ళి,  దేవుడు చేసిన పెళ్ళి, వయసొచ్చిన పిల్ల, జేబు దొంగ , బలిపీఠం, భారతంలో ఒక అమ్మాయి, బాబు, జ్యోతి ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు మురళీ మోహన్. అంతే కాకుండా వివిధ పాత్రలతో ఎంత గానో మెప్పించి సుస్థిర స్థానం సంపాదించాడు. అలానే ఈ నటుడు మంచి నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. 

 


నటుడిగా మన అందరికీ తెలిసిన మురళీ మోహన్ ఓ రాజకీయ నాయకుడు కూడా. 1985 లో నటుడు మురళీ మొహన్ నంది అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఓ తండ్రి తీర్పు అనే సినిమాతో అవార్డుని దక్కించుకున్నాడు. ఇతను మంచి వ్యాపారి కూడ. ఈయిన నాటకాల నుండి సినిమాల్లోకి అడుగు పెట్టాడు. మొదట వ్యాపారం పెట్టిన మురళీ మోహన్ విజయవాడలో నాటకాలు చేస్తూ నెమ్మదిగా సినిమాల వైపు ప్రవేశం చేసాడు. తర్వాత సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. అనేక సినిమాల్లో ఈయిన పాత్ర చెప్పుకోదగ్గది.

 

సినిమాల్లో నటించే ఈయిన రాజకీయాల్లో కూడ మంచి స్థానం దక్కించుకున్నాడు. ఇలా నటుడు మురళీ మోహన్ రాజకీయాలలో కూడా ప్రవేశించాడు. ఆయన తెలుగు దేశం పార్టీలో చేరాడు. తదుపరి 2009వ సంవత్సరంలో జరిగిన 15వ లోకసభ ఎన్నికల్లో నిలబడ్డాడు.  రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం అభ్యర్థిగా నిలిచి పోటీలో పాల్గొన్నాడు.

 


 కానీ మురళీ మోహన్ ఆశలు నిరాశలు అయ్యాయి. గెలుపు దూరమై ఓటమి చెంత చేరింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తాను 2,147 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత  మరోసారి 2014లో 16వ లోకసభ ఎన్నికలలో మళ్ళీ రాజమండ్రిలోనే పోటీ చేసాడు. ఈసారి మురళీ మోహన్ గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: