సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం సర్వ సాధారణం. ఎన్టీఆర్ వచ్చి పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడని అందరు అదే దారిలో వెళ్ళలేరు. వారి ఫాలోయింగ్ ను బట్టి ఆల్రెడీ ఉన్న పార్టీలలో చేరుతారు. అయితే ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏదో చేయబోయారు. కాని చిరు పొలిటికల్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక అన్న తర్వాత తమ్ముడు పవన్ కళ్యాన్ వచ్చి జనసేన పార్టీ పెట్టాడు. తను ఇచ్చే స్పీచులు బాగున్నా తనకు మాత్రం ప్రజల ఆమోదం లేదని ఏపి ఎన్నికల తర్వాత అర్ధమైంది. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ కు అధికారమే వచ్చేస్తుంది అన్నంత రేంజ్ లో అప్పట్లో టాక్ నడిచింది.

 

అయితే పాలిటిక్స్ అంటే చాలా ఉంటాయి.. కెమెరా ముందుకొచ్చి డైలాగ్ చెప్పినట్టు కాదు రాజకీయం అంటే. అయినా పవన్ మాత్రం ఇప్పటికీ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 2014 లో పార్టీ పెట్టి అప్పుడు ఆ ఇయర్ ఎన్నికల్లో పాల్గొనని పవన్ 2019లో ఎలక్షన్స్ లో పోటీ చేశాడు. పార్టీ పరిస్థితి ఎటుంచితే తను పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయాడు. పవన్ లాంటి క్రేజ్ ఉన్న వ్యక్తి పోటీ చేసిన రెండు చోట్ల అపజయ పాలవడం ఆశ్చర్యం అనిపించింది. పవన్ మీటింగులకు వచ్చే ప్రజలంతా జనసేన ఫాలోవర్స్ అనుకున్నారు. వారంతా కేవలం పవన్ ను చూసేందుకు వచ్చిన వారని తర్వాత తెలిసింది.

 

ఇక ఈమధ్య బిజెపి తో కలిసి పనిచేయాలని అనుకున్న పవన్ పాలిటిక్స్ తనకి అర్ధం కానట్టు ఉన్నాడా లేక అర్ధమై కూడా అలా నటిస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఓ పక్క పవన్ ఎప్పటికైనా సరే సిఎం అవుతాడని జనసైనికులు నమ్మకం పెట్టుకుంటే పవన్ మాత్రం తను ఇచ్చే స్పీచులు.. చేసే పనులు క్లారిటీ లేకుండా చేయడంతో మిగతా వారికి చులకన అవుతున్నాడు. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చూస్తున్న పవన్ ఎప్పటికి అది సాధ్యపడేలా చేస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: